Rashi Singh: ఆ హీరోయిన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్.. అయినా ట్రోల్ చేస్తోన్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఎందుకంటే..

తాజాగా మరో హీరోయిన్ నెట్టింట ట్రోలింగ్ భారిన పడింది. నిజానికి తాను విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంటూ చెప్పడంతో అసలు కథ మొదలైంది. విరాట్ క్లోహీ ఫ్యాన్ అంటూ ఓ వీడియో షేర్ చేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆ హీరోయిన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు ? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అనేది తెలుసుకోవాల్సిందే.

Rashi Singh: ఆ హీరోయిన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్.. అయినా ట్రోల్ చేస్తోన్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఎందుకంటే..
Rashi Singh
Follow us

|

Updated on: Apr 30, 2024 | 12:45 PM

ప్రస్తుతం ఐపీఎల్ హంగామా నడుస్తోంది. దేశమంతా క్రికెట్ ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. తమ అభిమాన టీం గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ ఐపీఎల్ రచ్చలో నెట్టింట సెలబ్రేటీలపై విరుచుకుపడుతున్నారు. ఓవైపు ఏ టీంకు సపోర్ట్ చేసిన మిగతా టీం ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ చాందిని చౌదరి ఐపీఎల్ టీం గురించి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీకి టీం ఉంటే దానికే సపోర్ట్ చేస్తానంటూ మాట్లాడడంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ తెగ్ ట్రోల్ చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది చాందిని. తాజాగా మరో హీరోయిన్ నెట్టింట ట్రోలింగ్ భారిన పడింది. నిజానికి తాను విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంటూ చెప్పడంతో అసలు కథ మొదలైంది. విరాట్ క్లోహీ ఫ్యాన్ అంటూ ఓ వీడియో షేర్ చేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆ హీరోయిన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు ? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అనేది తెలుసుకోవాల్సిందే.

సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ప్రసన్న వదనం. ఈ మూవీలో రాశిసింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది రాశి. ఈ క్రమంలోనే ఇటీవల ఉప్పల్ వేదికగా జరిగిన ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసేందుకు వెళ్లింది. అందులో హైదరాబాద్ టీంకు సపోర్ట్ చేస్తూ కనిపించింది రాశి. అయితే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ 35 పరుగుల తేడాతో ఆర్సీబీ మీద ఓడిపోయింది. దీంతో రాశఇ రియాక్ట్ అవుతూ.. “ఓడిపోతే ఏమైంది.. మేమే రికార్డ్ కొట్టాం.. కానీ అందరం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ యే” అంటూ ఓ వీడియో షేర్ చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యా్న్స్ రాశిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

విరాట్ ఫ్యాన్స్ అయినప్పుడు ఆర్సీబీకి సపోర్ట్ చేయాలి కదా.. ఎందుకు ఎస్ఆర్హెచ్ కు సపోర్ట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తూ రాశిని ట్రోల్ చేశారు. దీంతో మరో వీడియో షేర్ చేసింది ఈ బ్యూటీ. అందులో రాశి మాట్లాడుతూ.. తనను బాగా వైరల్ చేస్తున్నందుకు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది. SRH సపోర్ట్ చేస్తున్నందుకు చాలా మంది తనను తిడుతున్నారని.. కానీ అందరం విరాట్ కోహ్లీ అభిమానులమే అని తెలిపింది. తాను హైదరాబాద్ లో ఉంటానని.. అందుకే తన టీం SRH అని.. తన టీంకే సపోర్ట్ చేస్తానని తెలిపింది. ఆర్సీబీని సపోర్ట్ చేస్తే ఇంకా వైరల్ అవుతానని అంటున్నారు.. కానీ నిజాయితీగా ఉంటానని.. తన టీంకే సపోర్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Rashi Singh (@rashi.real)

View this post on Instagram

A post shared by Rashi Singh (@rashi.real)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ఉద్వేగభరిత ప్రసంగం..!
రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ఉద్వేగభరిత ప్రసంగం..!
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి