తొక్కే కదా అని తీసిపారేయకండి.. లాభాలు తెలిస్తే షాకే

Phani.ch

17  May 2024

సాధారణంగా అరటిపండు తిన్న తర్వాత తొక్కను బయట పడేస్తాం అయితే దీనిలో ఉండే పోషకవిలువలు మీకు తెలిస్తే పొరపాటునకూడా దీనిని బయట పడెయ్యారు.

అరటి తొక్కల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండు తొక్క భాగం మీద మెత్తని పీచు వంటి పదార్ధం ఉంటుంది.

అరటి తొక్కల ద్వారా చర్మ సౌందర్య పెరిగి మొఖం ప్రకాశిస్తుంది. దీని వలన జుట్టుకు కూడా అనేక లాభాలు ఉన్నాయి.

అంతే కాకుండా ఈ పీచు వంటి పదార్ధం అనేక పోషక విలువలకు నిలయం. దీనిలో కెరోటినాయిడ్ లు, ఫలవినోయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

వీటితో పాటుగా శరీర పనితీరు మెరుగుపడటానికి ఉపయోగపడే మాంగనీస్, పొటాషియం లభిస్తాయి. అరటి పళ్ళ తొక్కలు శరీరంలోని మలినాలను బయటకు పంపించి శరీరాన్ని డిటాక్స్ చెయ్యడంలో తోడ్పడతాయి.

అరటి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే పళ్ళ మీద ఉండే పసుపు పచ్చ ఛాయా తొలిగిపోయి, దంతాలు తెల్లగా, నిగారింపుగా కనిపిస్తాయి.

వీటిని మొఖం మీద మసాజ్ చేస్తే మచ్చలు తగ్గి, కాంతివంతంగా ప్రకాశించడానికి తోడ్పడుతుంది. కళ్లకింద డార్క్ సర్కిల్స్ కూడ అరటి తొక్కలతో మసాజ్ చేస్తే ఆ మచ్చలు తగ్గడానికి ఆస్కారముంటుంది.

వీటిని జుట్టుకు అప్లై చేసుకుంటే, జుట్టుకు కావాల్సిన పోషకాలు అంది జుట్టు ఒత్తుగా, నిగారింపుగా ఉంటుంది. వీటిని తింటే గుండె జబ్బులు మరియు ఇతర రోగాలను తట్టుకునే శక్తీ లభిస్తుంది.