Prakash Raj: ప్రకాష్ రాజ్‏తో కలిసి అల్లరి చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?

|

Mar 26, 2021 | 4:55 PM

Prakash Raj BirthDay: ప్రకాశ్ రాజ్.. ఈ పేరు చెప్పగానే.. ఎన్నో పాత్రలు కళ్ళముందుకు వచ్చేస్తాయి. ఏ పాత్రలో అయినా... అలవోకగా ఒదిగిపోయే వ్యక్తి ప్రకాశ్ రాజ్. ఇప్పటి

Prakash Raj: ప్రకాష్ రాజ్‏తో కలిసి అల్లరి చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?
Prakash Raj
Follow us on

Prakash Raj BirthDay: ప్రకాశ్ రాజ్.. ఈ పేరు చెప్పగానే.. ఎన్నో పాత్రలు కళ్ళముందుకు వచ్చేస్తాయి. ఏ పాత్రలో అయినా… అలవోకగా ఒదిగిపోయే వ్యక్తి ప్రకాశ్ రాజ్. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలలో వేరే వ్యక్తిని ఊహించుకోలేని విధంగా ఆ పాత్రలో లీనమవుతారు. హీరోగా, ప్రతి నాయకుడిగా, నిర్మాతగా.. దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో తనదైన ముద్రవేశారు. అందుకే ఆయనను విలక్షణ నటుడు అంటారు. సినిమాల్లో విలన్ పాత్రలలో ఎంత కర్కశంగా కనిపిస్తారో.. అదే ప్రతినాయకుడి పాత్రలో లెక్కలేనంత హాస్యాన్ని పండించడం కూడా ఆయనకే చెల్లుతుంది. నటుడిగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అదే స్థాయిలోనూ వివాదాలను ముటగట్టుకున్నాడు. ఇవి కాకుండా.. ఆయనలో మరో మానవతా వాది కూడా ఉన్నాడు. మార్చి 26 ఈ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు శుభకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్‏కు సంబంధించిన  కొన్ని రేర్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు అభిమానులు. అయితే ఇందులో ఓ ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతుంది. అందులో ప్రకాష్ రాజ్ ఓ టాప్ హీరోయిన్‏ను ఆటపట్టిస్తూ కనిపిస్తున్నారు. ఆమె ఎవరో కాదండోయ్.. దివంగత నటి సౌందర్య. సీనియర్ హీరో సాయి కుమార్, సౌందర్య జంటగా నటించిన అంతఃపురం సినిమాలో ప్రకాష్ రాజ్, హీరో జగపతి బాబు కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్.. సౌందర్యకు మీసం పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read:

మీసం మెలేసిన రామరాజు.. ఈ మూడు రోజులు ఫ్యాన్స్‌కు పండగే.. బ్యాక్ టూ బ్యాక్..

చేసింది ఒకే సినిమా.. కానీ అవకాశాలు మాత్రం బోలేడు.. నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన యంగ్ హీరో..