Kalki 2898 AD: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గనున్న కల్కి టికెట్ల ధరలు.. ఎప్పటినుంచంటే?

సలార్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మరో చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Kalki 2898 AD: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గనున్న కల్కి టికెట్ల ధరలు.. ఎప్పటినుంచంటే?
Kalki 2898 Ad Movie
Follow us

|

Updated on: Jul 02, 2024 | 2:45 PM

సలార్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మరో చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలో రిలీజైన కల్కి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. నిర్మాతలపై కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి ఉందంటున్నారు. ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన ఈ మూవీ ఈ వీకెండ్ నాటికి రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కల్కి సినిమా తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టడానికి ప్రధాన కారణం పెంచిన టికెట్ రేట్లేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చాయి. అదనపు షోస్ కు కూడా ఓకే చెప్పాయి. దీంతో కల్కి టికెట్ల ధరలు కొండెక్కాయన్న భావన వినిపిస్తోంది.

మల్టీప్లెక్స్ లో ఒక వ్యక్తి కల్కి సినిమా చూడాలంటే కనీసం 500 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సింగిల్ స్క్రీన్‌లో కూడా టికెట్‌ ధరలు భారీగానే ఉంటున్నాయి. దీంతో సామాన్యులు కల్కి సినిమాపై విమర్శలు చేస్తున్నారు. టికెట్ల ధరలు చాలా భారీగా ఉన్నాయంటూ.. ఫ్యామిలీ మొత్తం చూడాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ క్రమంలో కల్కి టికెట్ ధరలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. త్వరలోనే ప్రభాస్ సినిమా టికెట్ల ధరలు తగ్గనున్నాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న ధరలు తగ్గించి.. సాధారణ రేట్లకే టికెట్లను విక్రయించనున్నట్లు సమాచారం. అంటే మల్టీప్లెక్స్‌లో టికెట్‌ ధర 235 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయలు చేయనున్నారని టాక్. వచ్చే వారం నుంచి తగ్గింపు ధరలు అమలులోకి వస్తాయని సమచారం.

ఇవి కూడా చదవండి

1000 కోట్ల దిశగా కల్కి అడుగులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.