హీరోయిన్లు కుళ్లుకునేంత అందం!

03 July 2024

TV9 Telugu

TV9 Telugu

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిలదొక్కుకున్న హీరోల్లో విశ్వక్‌ సేన్‌ ఒకరని చెప్పడంతో సందేహం లేదు. విభిన్న కథలతో అలరిస్తున్న యంగ్‌ హీరో తనదైనా శైలిలో  కెరీర్‌లో ముందుకెళ్తున్నాడు

TV9 Telugu

ఐదేళ్ల క్రితం ఫలక్‌నుమా దాస్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న విశ్వక్‌.. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు

TV9 Telugu

యాటిట్యూడ్‌ చూపించే విశ్వక్‌ కేవలం మాస్‌ సినిమాలకే సెట్టవుతాడన్న అభిప్రాయాలను అశోకవనంలో అర్జున కల్యాణం మూవీతో తప్పని రుజువు చేశాడు

TV9 Telugu

ఈ ఏడాది గామితో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకున్న విశ్వక్‌.. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరితో పర్వాలేదనిపించేలా కనిపించాడు. ఈ హీరో తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు

TV9 Telugu

విష్వక్‌ సేన్‌ తాజాగా 'లైలా' అనే కొత్త మువీని ప్రకటించాడు. ఇందులో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది

TV9 Telugu

ఈ మువీలో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తుండగా.. ఆకాంక్ష శర్మను హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు

TV9 Telugu

ఈ మేరకు రిలీజ్‌ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఈ రోజు విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్‌ కళ్లు మాత్రమే చూపించారు

TV9 Telugu

ఇది చూసిన నెటిజన్లు హీరోయిన్లు సైతం కుళ్లుకునేంత అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ మువీ షూటింగ్‌ ప్రారంభం కానుంది