డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను మరోసారి హర్ట్ చేశారు… బాహుబలి ఇమేజ్.. సాహో స్టైల్‌ను పక్కన పెట్టి రొమాంటిక్ హీరోగా మారిన ప్రభాస్ కూల్ అండ్ క్లాసీ అప్‌డేట్స్‌తో టైం పాస్ చేస్తున్నారు. మిగతా హీరోలంతా మాస్ మేనియాతో ఊపేస్తుంటే… డార్లింగ్ ఇచ్చే అప్‌డేట్స్ మాత్రం చప్పగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి, సాహో సినిమాలతో నేషనల్ లెవల్‌లో సూపర్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు రొమాంటిక్ స్టార్‌గా మారిపోయారు. రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌లో జోష్ నింపే అప్‌డేట్ ఒక్కటి కూడా రాలేదన్నది ఫ్యాన్స్ కంప్లయింట్. పోస్టర్స్, మోషన్ పోస్టర్, టీజర్ ఇలా రాధేశ్యామ్ నుంచి వచ్చిన ఏ అప్‌డేట్ కూడా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేయలేదంటున్నారు డై హార్డ్ ఫ్యాన్స్.
ఉగాది రోజు మరో పోస్టర్‌ను వదిలింది రాధేశ్యామ్ టీమ్… ఈ పోస్టర్‌లోనూ… వావ్ అనిపించే మాస్ ఎలిమెంట్ ఏ మాత్రం కనిపించలేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మెనీ ఫెస్టివల్ వన్ లవ్ అనే కామెంట్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ మీద పంచులు కూడా బాగానే పడుతున్నాయి. చాలా ఫెస్టివల్స్ అవుతున్నా సినిమా మాత్రం పూర్తి కావటం లేదంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.
Also Read: మాస్క్ పెట్టుకోనివారిపై నెట్టింట పేలుతోన్న జోక్స్.. ప్రజంట్ ట్రెండింగ్‌లో ఉన్న జోక్ మీ కోసం