Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. తెలుగు దర్శకుల కోసం భారీ సాయం..

ఇక కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుంటారు. తన సినిమా షూటింగ్ సె‏ట్లో ఉన్నవాళ్లకు ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం తెప్పిస్తాడని ఇదివరకు చాలా మంది నటీనటులు చెప్పారు. అలాగే తన తోటి ఇతర భాష నటీనటులకు తెలుగింటి రుచులను రుచి చూపిస్తాడు. భోజనం విషయంలోనే కాకుండా యంగ్ హీరోలకు అండగా ఉంటాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు ప్రభాస్.

Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. తెలుగు దర్శకుల కోసం భారీ సాయం..
Prabhas
Follow us

|

Updated on: Apr 23, 2024 | 3:01 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి మూవీతో డార్లింగ్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ మూవీస్ కోసం సౌత్, నార్త్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. హీరోగానే కాకుండా డార్లింగ్ మంచి మనసు గురించి అందరికి తెలిసిందే. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. ఎప్పుడూ మౌనంగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంటారు. ఇక కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుంటారు. తన సినిమా షూటింగ్ సె‏ట్లో ఉన్నవాళ్లకు ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం తెప్పిస్తాడని ఇదివరకు చాలా మంది నటీనటులు చెప్పారు. అలాగే తన తోటి ఇతర భాష నటీనటులకు తెలుగింటి రుచులను రుచి చూపిస్తాడు. భోజనం విషయంలోనే కాకుండా యంగ్ హీరోలకు అండగా ఉంటాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు ప్రభాస్.

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మే 4న ప్రతి ఏడాది డైరెక్టర్స్ డేగా జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మెగాస్టార్ చిరంజీవితోపాటు.. సినీ ప్రముఖులకు, అగ్ర హీరోలకు.. నటీనటులకు పంపినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఈ వేడుకకు ప్రభాస్ ను సైతం ఆహ్వానించగా.. వస్తానని మాట ఇవ్వడంతోపాటు.. ఈ కార్యక్రమానికి రూ. 35 లక్షల విరాళాన్ని డైరెక్టర్స్ అసోసియేషన్ కు అందించారట. ఈ విషయాన్ని తెలుగు సినిమా దర్శకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడుంబా శంకర్ దర్శకుడు వీర శంకర్ తెలిపారు.

దీంతో ప్రభాస్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. డార్లింగ్ ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి ప్రాజెక్టులో నటిస్తున్నారు . భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇవే కాకుండా మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?