Mahesh Babu: మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేయడానికి ప్రభాస్ సినిమా కారణమట.. అదెలా అంటే

|

Apr 09, 2023 | 12:22 PM

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు వెంకటేష్ కూడా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో చిన్నోడిగా మహేష్, పెద్దోడిగా వెంకటేష్ నటించి మెప్పించారు.

Mahesh Babu: మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేయడానికి ప్రభాస్ సినిమా కారణమట.. అదెలా అంటే
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఆయన కెరీర్ బెస్ట్ మూవీస్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు వెంకటేష్ కూడా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో చిన్నోడిగా మహేష్, పెద్దోడిగా వెంకటేష్ నటించి మెప్పించారు. అయితే మహేష్ ఈ సినిమా చేయడానికి ప్రభాస్ సినిమా కారణమట. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ప్రభాస్ నటించిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు తనకు  ఏదైనా సినిమా నచ్చితే వెంటనే ఆ హీరోకో, హీరోకో ఫోన్ చేయడమో.. మెసేజ్ పెట్టడమో చేస్తూ ఉంటాడు.

మిస్టర్ పర్ఫెట్ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు దిల్ రాజుకు మెసేజ్ పెట్టారట. సినిమా చాలా బాగుంది. మాస్ హీరోను చాలా క్లాస్ గా చూపించారు అని మెసేజ్ చేశాడట మహేష్. అదే సమయంలో శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కథను రెడీ చేసి.. పేదోడు పాత్రకు వెంకటేష్ ను ఫిక్స్ కూడా చేశారట.

అయితే మహేష్ మెసేజ్ చూసిన దిల్ రాజ్ వెంటనే . దర్శకుడు శ్రీకాంత్ కు ఫోన్ చేసి మహేష్ బాబు కు ఈ కథ చెప్పద్దాం అన్నారట. దూకుడు మూవీ సెట్స్ పై ఉండగా మహేష్ కు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కథ చెప్పారట శ్రీకాంత్. దాంతో మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. అలా మహేష్ సీతమ్మ వాకిట్లో సినిమా చేయడానికి ప్రభాస్ సినిమా కారణమైందట.