గత కొద్ది రోజులుగా సినీ ప్రియులకు వరుస షాకులిస్తున్న ఐబొమ్మ ఇప్పుడు మరో బిగ్ షాకిచ్చింది. ఇప్పటికే సినిమాల డౌన్ లోడ్ చేసుకోవాడనికి వీలు లేదని తేల్చీ చెప్పిన ఐబొమ్మ.. ఇక ఇప్పుడు తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 9 నుంచి ఇండియాలో తమ ఆపరేషన్లను పూర్తిగా మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. మరోసారి తిరిగి వచ్చే ఆలోచన తమకు లేదని.. ఎవరూ మెయిల్స్ చేయవద్దని ప్రేక్షకులను కోరింది. తమ పై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
సినీ ప్రియులకు ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓటీటీలో విడుదలయ్యే అన్ని సినిమాలను డబ్బులు వెచ్చించకుండానే హై క్వాలిటీలో ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు సినిమా మొత్తాన్ని డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. దీంతో ఐబొమ్మను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఐబొమ్మ సినీ ప్రియులకు వరుసగా షాకులిస్తుంది. గతంలో తమ సేవలను ఇండియాలో పూర్తిగా నిలివేస్తున్నట్లు ప్రకటించి.. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక రెండు రోజుల క్రితం ఐబొమ్మ వెబ్ సైట్ నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలు లేదని ఆంక్షాలు విధించింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 9 నుంచి తమ సేవలను పూర్తిగా షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. తమకు తిరిగి వచ్చే ఆలోచన లేదని.. ప్రేక్షకులు మెయిల్స్ చేయవద్దని కోరింది. ఇక ఇప్పుడు ఐబొమ్మ తీసుకున్న ఈ నిర్ణయం ప్రేక్షకులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.