Actress Poorna: అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం ఇప్పుడు సహాయక నటిగా రాణిస్తోంది. అలాగే స్పెషల్ సాంగుల్లోనూ సందడి చేస్తోంది. అయితే తాజాగా ఈ అందాల తార సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Actress Poorna: అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
Actress Poorna

Updated on: Sep 16, 2026 | 12:02 PM

టాలీవుడ్ నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత సహాయక నటిగానూ మెరిసిందీ అందాల తార. లెజెండ్ వంటి సినిమాల్లో పూర్ణ పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకమహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసిందీ అందాల తార. కేవలం నటిగానే కాదు బుల్లితెరపై ఢీ వంటి డ్యాన్స్ రియాలిటీ షోల్లో జడ్జీగా కూడా చేసింది పూర్ణ. అయితే పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిందీ అందాల తార. తన ఇద్దరు పిల్లల పెంపకంతో బిజీగా ఉంటోంది. కాగా క్లాసికల్ డ్యాన్స్ లో నిపుణురాలైన పూర్ణ ఓ డ్యాన్స్ స్టూడియోని కూడా నడుపుతోంది. షమ్నా ఖాసీమ్ డ్యాన్స్ స్టూడియో పేరుతో నిర్వహిస్తోన్న ఈ డ్యాన్స్ స్కూల్ లో ఎంతో మంది పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. నటి పూర్ణ స్వయంగా పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తోంది. అయితే తాజాగా తన స్టూడియోలో డ్యాన్స్ నేర్చుకునే ఓ పాప చనిపోయింది. దీంతో పూర్ణ కన్నీరుమున్నీరవుతోంది. ఈ క్రమంలో తన స్టూడెంట్ కు నివాళి అర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది పూర్ణ.

‘కొన్ని వీడ్కోళులు మాటలకు అందవు. ఎంతలా కన్నీళ్లు పెట్టుకున్నా నా గుండెల్లోని బాధ తొలగి పోవడం లేదు. చిన్నారి అమాయకమైన చిరునవ్వు, డాన్స్ నేర్చుకునే సమయంలో వేసిన చిన్ని చిన్ని అడుగులు స్టూడియోలోని ప్రతి మూలలో ఎప్పటికీ జ్ఞాపకాలుగా నిలిచిపోతాయ్. ఈమె నా స్టూడెంట్ మాత్రమే కాదు. నా కుటుంబంలో ఒకరిగా భావించా. నా డ్యాన్స్ స్టూడియో ఉన్నంతకాలం ఈ చిన్నారి మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, నీకు కన్నీటి నివాళి అర్పిస్తున్నాం’ అని నటి పూర్ణ రాసుకొచ్చింది. అయితే పాపకు ఏమైందో కచ్చితమైన కారణం చెప్పలేదీ నటి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

నటి పూర్ణ ఎమోషనల్ పోస్ట్..

సినిమాల విషయానికి వస్తే.. పూర్ణ చివరగా గతేడాది డిసెంబరులో రిలీజైన ‘అఖండ 2’ మూవీలో కనిపించింది. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’లోనూ స్పెషల్ సాంగ్ చేసింది.

డ్యాన్స్ స్టూడియో నిర్వహిస్తోన్న పూర్ణ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us