Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా…

టాలీవుడ్‌లో ఇప్పుడు పోటీ మామూలుగా లేదుగా... అని అనుకుంటున్నారు తెలిసిన వాళ్లంతా. అయినా ఒక ప‌క్క క‌రోనాతో ఎక్క‌డివాళ్లు అక్క‌డ ఇళ్ల‌ల్లో ఉంటే ఇక పోటీ ఎక్క‌డిది

Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా...
Pooja Hegde

Updated on: May 11, 2021 | 6:51 PM

pooja hegde: టాలీవుడ్‌లో ఇప్పుడు పోటీ మామూలుగా లేదుగా… అని అనుకుంటున్నారు తెలిసిన వాళ్లంతా. అయినా ఒక ప‌క్క క‌రోనాతో ఎక్క‌డివాళ్లు అక్క‌డ ఇళ్ల‌ల్లో ఉంటే ఇక పోటీ ఎక్క‌డిది అని మీర‌నుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది అస‌లు సంగ‌తి…. అందులోనూ ర‌ష్మిక వ‌ర్సెస్ పూజా మేట‌ర్ ఇది…య‌స్ ఇప్పుడు ర‌ష్మిక వ‌ర్సెస్ పూజా హెగ్డే అన్న‌ట్టే ఉంది సిట్చువేష‌న్‌. ఆఫ‌ర్ల విష‌యంలోనే కాదు… అంద‌రికీ పంచి పెట్టే విష‌యంలోనూ ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు పోటీప‌డుతున్నారు. `థాంక్యూ ర‌ష్మిక నువ్వు పంపించే కాఫీ పొడి ఇప్ప‌టికీ అందుతోంది` అని ఆ మ‌ధ్య డైర‌క్ట్ గా స్టేజీ మీదే చెప్పేశారు నాగ్‌

ర‌ష్మిక స్టార్లంద‌రికీ కాఫీ పౌడ‌ర్ పంచుతున్న విష‌యం తెలుసుకున్నారేమో పూజా హెగ్డే సీజ‌న్‌కి త‌గ్గ‌ట్టు రియాక్ట్ అయ్యారు. త‌న ఫామ్ లో పండిన మామిడి పండ్ల‌ను త‌న‌కు తెలిసిన వాళ్లంద‌రికీ పంపించ‌డం మొద‌లుపెట్టార‌ట‌. ఆల్రెడీ టాలీవుడ్‌లో మామిడి ప‌ళ్ల‌ను నియ‌ర్ అండ్ డియ‌ర్స్ కి పంపే క‌ల్చ‌ర్ ఎలాగూ ఉంది.ఇంత‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ పంపిన పండ్ల‌కు థాంక్స్ చెప్పిన వారి లిస్టు చిన్న‌దేం కాదు. ఇక ఇప్పుడు అంద‌రూ జిగేల్‌రాణికి థాంక్స్ చెప్ప‌డం షురూ చేస్తార‌న్న‌మాట‌. సో ఫీల్డ్ ఏదైనా మా మ‌ధ్య పోటీ మాత్రం కామ‌న్ అని అంటున్నారు పూజా అండ్ ర‌ష్మిక‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss4 winner Abhijeet: అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్4 విన్నర్

Mohanlal: ఆరు ప‌దుల వ‌య‌సులోనూ మోహ‌న్ లాల్ క్రేజీ వ‌ర్క‌వుట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Bigg Boss4 winner Abhijeet: అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్4 విన్నర్

 

Loading...
Unable to load recommendations.
Follow Us