టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు పూజ హెగ్డే. నాగచైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’ సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించి అలరించిన పూజాహెగ్డే . ఆతర్వాత వచ్చిన ‘డీజే’ సినిమాలో తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది.
వరుసగా స్టార్ హీరోలందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసి ఇప్పుడు టాప్ పొజిషన్ లో సెటిల్ అయ్యింది. ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్ లోను సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోయిన్ గా రాణించడం అంటే అంత సులభంమైన విషయమేమి కాదు. కొంతమంది ఎంత కష్టపడినా ..టాప్ హీరోయిన్ గా రాణించలేరు. ఒకటి రెండు సినిమాలకే కనుమరుగైన హీరోయిన్లు కూడా ఉన్నారు..కానీ పూజాహెగ్డే మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది. కెరియర్ ప్రారంభంలో కన్న కలలన్ని ఇప్పుడు నిజమయ్యాయని ఆనందం వ్యక్తం చేస్తుంది ఈ వయ్యారి. ‘నేను అభిమానించే హీరోల సరసన సినిమాలు చేసే ఛాన్స్ దక్కింది. కష్టపడే తత్వం ఉంటే కలలన్ని నిజమవుతాయి, నా శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతున్నా.. అంటూ చెప్పుకొచ్చింది పూజా. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ బ్యూటీ అలాగే రోహిత్‌శెట్టి దర్శకత్వంలో ‘సర్కస్’ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.