Peddi Pre-Release Event Updates: నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా : రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరవాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Peddi Pre-Release Event Updates:  నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా : రామ్ చరణ్
Ram Charan

Updated on: Jun 01, 2026 | 10:41 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జూన్ 1వ తేదీన (నేడు) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఈవెంట్‌ను నిర్వహించారు ‘పెద్ది’ టీమ్. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్‌లా లేదు.. సక్సెస్ మీట్ చేస్తున్నట్లుంది. విజయవాడ మాకు లక్కీయెస్ట్ సిటీ.. ఖైదీ నెం 150, ఇంద్ర ఇక్కడే చేసాం.. ఆ లక్కును కాస్త మేం కూడా ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాం. పెద్ది హృదయానికి హత్తుకునే కథ.. పదేళ్లకు ఒక్కసారి వస్తుందేమో.. ఇలాంటి కథ నా దగ్గరికి తెచ్చినందుకు సుకుమార్ గారికి థ్యాంక్యూ..  నా సినిమా లైబ్రరీలో టాప్ సినిమాగా నిలిచిపోతుంది పెద్ది. యాక్టర్‌గా సాటిస్‌ఫై చేసింది.. నన్ను చాలా మార్చేసింది సినిమా..

బుచ్చిబాబు నాకు ఇది సినిమా కథలా కాకుండా ఒక వ్యక్తి జర్నీలా చెప్పారు.. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు.. కిందకి పడి.. పడిన మనిషి లేని ఎలా నిల్చుంటాడో తెలిసేలా చేసిన కథ ఇది.. ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతాం..?
బహుశా మగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ తర్వాత నాకు పెద్దిలో ఆ అద్భుతం కనిపిస్తుంది.. రాసిపెట్టుకోండి.. ఇండియాలో నెంబర్ 3,4లో టాప్ డైరెక్టర్స్‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. మీకోసం రక్తం చిందించి కూడా పని చేస్తాను.. నాకు తెలిసింది సినిమా మాత్రమే.. చనిపోయేవరకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాం.. అలాగే రెహమాన్ గారు 280 రోజులు మేం పని చేస్తే.. దానికి ప్రాణం పోస్తున్నారు.. ఆయనకు థ్యాంక్యూ..  జాన్వీ గారిని చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతుంటారు..
ఎప్పుడైనా ఆట ఓడిపోతే.. ఒక దేశం మొత్తం ఓడిపోయినట్లు.. అలాగే ఈ పెద్ది గాడు ఆటాడలేదు.. పోరాడాడు.. పెద్ది గాడి ఆత్మగౌరవాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తారని మనస్పూర్తిగా దుర్గమ్మను కోరుకుంటున్నాను.. మీ కుటుంబ సభ్యులను అడిగానని చెప్పండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Jun 2026 09:50 PM (IST)

    దివ్యేందు శర్మ మాట్లాడుతూ

    దివ్యేందు శర్మ మాట్లాడుతూ.. ఇది నా తెలుగు మొదటి సినిమా.. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బుచ్చిబాబు వల్లే అయ్యింది. ఈ సినిమా చేసేటప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు చాలా ఆదరించారు. రామ్ చరణ్ గురించి ఏం చెప్పినా తక్కువే.. అతనితో కలిసి నటించడం అంత ఈజీ కాదు.. ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు.  ఇది కేవలం ఒక ఏరియా సినిమా కాదు.. ఇది పాన్ ఇండియా సినిమా..

  • 01 Jun 2026 09:43 PM (IST)

    పెద్ది సినిమా నాకు చరణ్‌తో నటించే ఛాన్స్ ఇచ్చింది: జాన్వీ కపూర్

    జాన్వీ కపూర్ మాట్లాడుతూ..  నా జీవితానికి అర్ధం మిమ్మల్ని అలరించడం, సినిమాలు చేయడం.. నా ఐడెంటిటీ ఈ భూమితో, మీతో కనెక్ట్ అయ్యి ఉంది. మేము చేసిన ఈ సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా.. ఈ సినిమా నాకు చాలా ఇచ్చింది. చరణ్ తో నటించే ఛాన్స్ ఇచ్చింది.. బుచ్చి బాబు నాకు తెలిసిన మోస్ట్ ప్యాషినేట్ డైరెక్టర్.. సినిమా టీమ్ అందరూ సినిమా కోసం బెస్ట్ ఇచ్చారు.

  • 01 Jun 2026 09:18 PM (IST)

    కొత్త సాంగ్ పాడిన ఏ‌ఆర్ రెహమాన్

    ఇప్పటివరకు విడుదల కానీ బ్యాగ్రౌండ్ సాంగ్ ను స్టేజ్ పై పాడిన సింగర్స్.. ఇంగ్లీష్ లిరిక్స్ తో అదిరిపోయిన సాంగ్ అండ్ మ్యూజిక్

  • 01 Jun 2026 09:09 PM (IST)

    లైవ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన ఏఆర్ రెహమాన్

    లైవ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన ఏఆర్ రెహమాన్.. పెద్ది సాంగ్స్ తో స్టేడియంలో ఉర్రుతలూగించిన రెహమాన్ అండ్ సింగర్స్

  • 01 Jun 2026 09:00 PM (IST)

    జగపతిబాబు మాట్లాడుతూ..

    జగపతిబాబు మాట్లాడుతూ.. 1962లో బెజవాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గర సరోజినీ దేవి హాస్పిటల్‌లో నేను పుట్టాను. ‘పెద్ది’ సినిమా సినిమా ఇండస్ట్రీలోని వారికి పెద్ద దిక్కు అవుతుంది. అందరి ఆకలి, దాహం తీర్చే మూవీ ఇది. నాకు చాలా మంచి కేరక్టర్‌ వచ్చి 8 ఏళ్లయింది.  అరవింద సమేత తర్వాత పెద్ది కేరక్టర్‌ నా బెస్ట్, సినిమా కూడా బెస్ట్ మూవీ అవుతుంది అని జగపతిబాబు అన్నారు.  రామ్‌చరణ్‌ మెగా పవర్‌ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు. ఏ స్టేట్‌కి వెళ్లినా, కంట్రీకి వెళ్లినా సిక్స్ కొట్టాడు..  ప్రతి షాటూ ఈ సినిమాలో సిక్స్ పడుతుంది. చరణ్‌ అంటే నాకు చాలా ఇష్టం.

    బుచ్చిబాబు పోర్టబుల్‌ సైజులో ఉంటాడు. బఠానీ సైజ్‌లో ఇంతుంటాడు.. కానీ అతను అన్‌స్టాపబుల్‌!  ప్రతి పాత్రనూ తను డిజైన్‌ చేసిన విధానం బావుంటుంది. నా అదృష్టం సెకండ్‌ ఇన్నింగ్స్ లో ఇలాంటి వాళ్లతో పనిచేస్తున్నాను. జాన్వీ చాలా బాగా యాక్ట్ చేసింది అని అన్నారు

  • 01 Jun 2026 08:38 PM (IST)

    రామ్ చరణ్ ను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు

    రామ్ చరణ్ ను చూసేందుకు ఆయనను ఫోటోలు తీసేందుకు ఎగబడ్డ అభిమానులు

  • 01 Jun 2026 08:36 PM (IST)

    మాస్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్

    పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గ్రాండ్ మాస్ ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

  • 01 Jun 2026 08:33 PM (IST)

    ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు

    దర్శకుడు బుచ్చిబాబు పెద్ది ఈవెంట్ కు హాజరయ్యారు.

  • 01 Jun 2026 08:31 PM (IST)

    పెద్ది ఈవెంట్ కు హాజరైన జగపతిబాబు

    రామ్ చరణ్ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జగపతిబాబు హాజరయ్యారు

  • 01 Jun 2026 08:30 PM (IST)

    సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు మాట్లాడుతూ..

    ఐమ్యాక్స్ వెర్షన్‌లో రిలీజ్‌ కానుంది ‘పెద్ది’.  విజయవాడ నాకు నచ్చడానికి మూడు రీజన్స్ ఉన్నాయి.  సినిమాలో ఫిల్మ్ నెగటివ్‌ వాడాం.. ఢిల్లీలో ఎమోషనల్‌ పోర్షన్‌ ఉంది. దానికి ఆర్గానిక్‌ ఫీల్‌ రావడానికి ఫిల్మ్ నెగటివ్‌ వాడాం.. నేను ఫిల్మ్ నెగటివ్‌ వాడిన లాస్ట్ సినిమా ‘రోబో’. యుఎస్‌ నుంచి ఫిల్మ్ నెగటివ్‌ స్టాక్‌ తెప్పించాం..  క్రికెటర్‌ నుంచి పెహల్వాన్‌ కి రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్‌ సూపర్‌. నైట్‌ ఎఫెక్ట్ లో రెయిన్‌లో గద పట్టుకున్నప్పుడు గూస్‌బంప్స్ వచ్చాయి.

  • 01 Jun 2026 08:19 PM (IST)

    జాన్వీ కపూర్ ఎంట్రీ..

    బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది.. చీరకట్టులో చందమామలా మెరిసింది జాన్వీ కపూర్

  • 01 Jun 2026 08:18 PM (IST)

    అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ..

    గాయాలైనా షూటింగ్‌లో పాల్గొన్నారు చరణ్..  అయ్యప్ప మాలలో ఉన్నా మల్లయోధుడిగా మెప్పించారు. చరణ్‌ కన్నా పెద్ద హీరో ‘పెద్ది’ కథ.  ‘పెద్ది’ కొండ కింది ఊరి రామాయణం, రామాయణం లాగా ‘పెద్ది కథ కూడా అంత బావుంటుంది.  పదేళ్లకు ఓ సారి వచ్చే సినిమాలా నిలిచిపోతుందని లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

  • 01 Jun 2026 08:02 PM (IST)

    ఎంట్రీ ఇచ్చిన నటుడు దివ్యేందు శర్మ

    నటుడు దివ్యేందు శర్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని చూసి అభిమానులు కోలాహంతో అరుపులతో హోరెత్తించారు

  • 01 Jun 2026 07:58 PM (IST)

    యాంకర్ సుమ ఎంట్రీ..

    పెద్ది ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న సుమ.. తన ఎనర్జీతో ఈవెంట్ మొదలుపెట్టిన సుమ కనకాల

  • 01 Jun 2026 07:56 PM (IST)

    పెద్ది ఈవెంట్ కు హాజరవుతున్న మూవీ టీమ్

    పెద్ది ఈవెంట్ కు హాజరవుతున్న సినీ ప్రముఖులు, మూవీ టీమ్..  మరికాసేపట్లో హీరో, హీరోయిన్ ఈవెంట్ కు రానున్నారు.

  • 01 Jun 2026 07:36 PM (IST)

    పెద్ది నినాదాలతో హోరెత్తుతున్న స్టేడియం

    పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా చేరుకున్న అభిమానులు.. స్టేడియం మొత్తం రామ్ చరణ్ పేరుతో మారుమ్రోగుతుంది.. పెద్ది పెద్ది అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులు

  • 01 Jun 2026 06:45 PM (IST)

    భారీబందోబస్త ఏర్పాటు చేసిన పోలీసులు.. 

    పెద్ది ఈవెంట్ గ్రాండ్ జరగనుండటంతో భారీగా అభిమానులు చేరుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు..

  • 01 Jun 2026 06:20 PM (IST)

    రామ్ చరణ్ కటౌట్స్‌తో పాటు బుచ్చిబాబు క్రేజీ కటౌట్స్

    విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఏర్పాటు చేసిన మూవీ టీమ్.. రామ్ చరణ్ కటౌట్స్ తోపాటు బుచ్చిబాబు, జాన్వీకపూర్ కటౌట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బుచ్చిబాబు పహిల్వాన్ గెటప్ లో ఉన్న కటౌట్స్ వైరల్ అవుతున్నాయి

  • 01 Jun 2026 06:15 PM (IST)

    మరికాసేపట్లో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్

    మరికాసేపట్లో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కానుంది. ఇప్పటికే స్టేడియం కు భారీగా అభిమానులు చేరుకున్నారు

Follow Us