Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. అటు సినిమాలు చేస్తూనే.. రాజకీయల్లోనూ క్రియ శీలక పాత్ర పోషిస్తున్నారు పవన్. ఇవే కాకుండా… యువతకు కావాల్సిన సలహాలు, సూచనలు కూడా ఇస్తూ.. వారిని ఎంకరేజ్ చేస్తున్నారు పవర్ స్టార్. ఇందులో భాగంగా.. యువతి యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు పెంపోందించుకోవడం ముఖ్యమని పిలుపునిచ్చారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో నెల్లూరుకి చెందిన మార్షల్ ఆర్ట్‌లో గిన్నిల్ బుక్ రికార్డ్ గ్రహీత ప్రభాకర్ రెడ్డిని సత్కరించారు. అనంతరం పవన్ నెలకోల్పిన పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా వారికి లక్ష రూపాయల చెక్ అందించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వింగ్ చున్ అనే మార్షల్ ఆర్ట్.. మన దేశంలో ఉన్న శిక్షకుల గురించి బ్రౌజ్ చేస్తుంటే. ప్రభాకర్ రెడ్డి గారి గురించి తెలిసింది. మార్షల్ ఆర్ట్స్‌లో వివిధ దేశాల్లో శిక్షణ పొంది.. రికార్డులు సాధించిన ఆయన పెద్ద పెద్ద నగరాలకు వెళ్లిపోకుండా.. తన ఊళ్లో ఉంటూ.. యువతకు శిక్షణ ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇలాంటి వారిని ప్రోత్సహించాలి. ఈ క్రమంలోనే మా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహయం చేశాను అంటూ చెప్పుకోచ్చారు.
అనతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్‌లో 29 ప్రపంచ రికార్డులు సాధించాను. థాయ్ లాండ్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో యుద్ద కళలు నేర్చుకున్నాను. చైనాలోని షావోలిన్ గుడిలో శిక్షణ తీసుకున్నాను. యువతకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉండటం ఎంతో ఉపయోగకరం. మన దేశంలో వీటిని నేర్చుకుంటున్నవారు తక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది.
వీటిపై ఆసక్తి ఎక్కువ. అందుకే నన్ను పిలిచి.. సత్కరించి ఆర్థిక సహాయం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అంటూ చెప్పకోచ్చారు. ప్రస్తుతం పవన్ అయ్యప్పనూమ్ కోషియమ్ తెలుగు రీమేక్ చేస్తున్నాడు. అలాగే క్రిష్ దర్శకత్వంలో హారిహార విరమల్లు సినిమా చేస్తున్నాడు.
Also Read:
AR Rehaman: యాంకర్ పై సంచలన కామెంట్లు చేసిన మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్..