ఆ మండే కళ్లు పవన్ కళ్యాణ్‌వే…!

మెగా అభిమానుల ఆశలు నెరవేరుస్తూ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన జోడు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఒకవైపు పొలిటీషన్‌గా, మరోవైపు నటుడిగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ షూటింగ్‌‌ షరవేగంగా జరుగుతోంది. ఊహించని విధంగా క్రిష్ డైరెక్షన్‌లో మరో మూవీకి పచ్చజెండా ఊపి ఫ్యాన్స్‌కి ఏకంగా పండగనే తీసుకువచ్చారు. అయితే ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌తో పాటు గతంలో నిర్మాతలకు సినిమా చేస్తానని హామి నేపథ్యంలో పవన్ […]

ఆ మండే కళ్లు పవన్ కళ్యాణ్‌వే...!

Updated on: Jan 30, 2020 | 1:49 PM

మెగా అభిమానుల ఆశలు నెరవేరుస్తూ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన జోడు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఒకవైపు పొలిటీషన్‌గా, మరోవైపు నటుడిగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ షూటింగ్‌‌ షరవేగంగా జరుగుతోంది. ఊహించని విధంగా క్రిష్ డైరెక్షన్‌లో మరో మూవీకి పచ్చజెండా ఊపి ఫ్యాన్స్‌కి ఏకంగా పండగనే తీసుకువచ్చారు. అయితే ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌తో పాటు గతంలో నిర్మాతలకు సినిమా చేస్తానని హామి నేపథ్యంలో పవన్ పునరాగమనం చేసినట్టు తెలుస్తోంది.

క్రిష్ చెప్పిన కథ..పవన్ని చాలా ఎగ్జైట్ చేసిందట. అందుకే మరో నేరేషన్ అవసరం లేకుండానే స్పాట్‌లో ఓకే చేశారని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే షూటింగ్ విషయంలో కూడా అంతే జోరు చూపిస్తున్నారు క్రిష్ అండ్ పవన్ జోడి. ఈ రోజే (జనవరి 29) సినిమా షూటింగ్ కూడా మొదలెట్టేశారు. రామానాయుడు స్టూడియోస్ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో షూటింగ్ షురూ అయ్యింది. కాగా పవన్‌కి ఇది 27వ సినిమా అవుతోంది. ఇది స్వాతంత్య్రానికి ముందు పరిస్థితులకు తగ్గట్టుగా.. జానపద నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై..ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పవన్ ప్రి లుక్‌ కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. ముఖానికి  ఎర్ర తువాలు కట్టుకుని, రౌంధ్రంతో ఉన్న పవన్ కళ్లు..మొత్తంగా లుక్ మెస్మరైజ్ చేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us