Hari Hara VeeraMallu: నడుచుకుంటూ వచ్చి పిడుగు తొడ కొడితే ఎట్టా ఉంటుందో తెల్సా.. హరి హర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్..

Pawan Kalyan Birthday: మెడల్ని వంచి, కథల్ని మార్చి..కొలిక్కితెచ్చే పనెట్టుకొని .. తొడకొట్టాడో.. తెలుగోడు అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోగా..

Hari Hara VeeraMallu: నడుచుకుంటూ వచ్చి పిడుగు తొడ కొడితే ఎట్టా ఉంటుందో తెల్సా.. హరి హర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్..
Pawan Kalyan

Updated on: Sep 02, 2022 | 11:34 AM

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. రెండు రోజుల ముందుగానే పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రెషన్స్ సందడి మొదలైంది. ఇప్పటికే ఫ్యాన్స్ కోసం పవర్ స్టార్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్స్ తమ్ముడు, జల్సా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ చేశారు మేకర్స్. భారీ కటౌట్స్.. పాలాభిషేకాలతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. తాజాగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా హరి హరి వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కాసేపటి క్రితం డైరెక్టర్ క్రిష్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో మెడల్ని వంచి, కథల్ని మార్చి..కొలిక్కితెచ్చే పనెట్టుకొని .. తొడకొట్టాడో.. తెలుగోడు అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోగా.. విలన్స్‏ను వేటాడుతూ పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు పవన్. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఎ.ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిధఇ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాదిలో వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.