
ఇప్పుడు ఎక్కడ చూసిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) మేనియా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా కోసం ప్రేక్షకులకు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్.. పవన్ , రానా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లలో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భీమ్లానాయక సినిమాతో సమ్మర్ చిత్రాలకు ఫుల్ మీల్స్ ఇచ్చేశాడు పవన్. ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా పరిస్థితులలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. విడుదలైన మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది.
కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు ఫిబ్రవరి 25న విడుదలైంది. మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్‌గా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించింది. సాగర్ కె.చంద్ర మూవీకి డైరెక్షన్ చేయగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. నెటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు చేశారు. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించారు. పవన్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. ఇండియాలోనే కాకుండా.. అమెరికాలో భీమ్లా నాయక్ సినిమా దాదాపు రూ. 14.95 కోట్లు వసూలు చేసింది. అదే విధంగా నైజాం ఏరియాలోనూ భీమ్లా నాయక్ మేనియా కనిపిస్తోంది.
Also Read: Sarkaru Vaari Paata: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్లోనే నెంబర్ వన్ రికార్డ్..
Nithiin: సౌత్ ఇండియాలోనే ఆ విషయంలో ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‌లో క్రేజ్ మాములుగా లేదుగా..
Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‌లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..
Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?