ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగారు హీరోయిన్ అనుష్క. బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ తర్వాత అనుష్క వరుస సినిమాలతో బిజీగా ఉంటుందనున్నారు అంతా. కానీ ఈ మూవీ తర్వాత ఒకటిరెండు చిత్రాలతో సైలెంట్ అయ్యారు. అనుష్క చివరిసారిగా కనిపించిన సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తర్వాత అనుష్క వెండితెరపై కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. నూతన దర్శకుడు మహేష్. పి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. మొత్తానికి నవీన్, అనుష్క ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్దమయ్యారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తాజాగా ఈ ట్రైలర్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ చూసి నవ్వు ఆపుకోలేకపోయానని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇందులో స్వీటీ, నవీన్ ఇద్దరూ అద్భుతంగా నటించారంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలకానుంది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ పై తన ఇన్ స్టా స్టోరీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కల్కి 2898 AD టైటిల్ పోస్టర్ రివీల్ చేస్తూ ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్..
తెలుగు అభిమానులకు ఇష్టమైన జంటలలో ప్రభాస్, అనుష్క ఒకటి. వీరిద్దరి కలిసి దాదాపు 5 చిత్రాల్లో నటించారు. అందులో బిల్లా, మిర్చి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్ క్లూజన్. దీంతో వీరిద్దరికి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2009లో వచ్చిన బిల్లా సినిమాతో ప్రభాస్, అనుష్క తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత 2013లో మిర్చి సినిమాతో మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క పెయిర్ అభిమానులను ఆకట్టుకుంది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుష్క.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.