Gopichand : మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న ఈ టాలెంటెడ్ హీరో. సీటిమార్ సినిమాతో సాలిడ్ సక్సెస్ కొట్టాలని కసిమీద ఉన్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గోపీచంద్ తమన్నా ఇద్దరు ఈ మూవీలో కబడ్డీ కోచ్ లుగా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు గోపీచంద్.
ఈ సినిమాను పక్కా కమర్షియల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కామెడీ ప్రధానంగా కథను రాసుకునే మారుతి గోపీచంద్ కోసం ఓ అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక చివరగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ప్రతిరోజు పండుగ అనే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు మారుతి. ఇక పక్క కమర్షియల్ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమా 2021 అక్టోబర్ 1 న సినిమాస్(థియేటర్ల)లో కి ..! అంటూ టీమ్ అనౌన్స్ చేసింది. అదేవిధంగా అక్టోబర్ ను టార్గెట్ చేసి షూటింగ్ చకచకా పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. యువి క్రియేషన్స్ – జీఏ2 సంస్థలు సంయక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీలో అందాల భామ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మారుతి ప్రతిరోజు పండుగే సినిమాలోనూ రాశిఖన్నా హీరోయిన్. అమ్మడి నటన నచ్చడంతో ఈ సినిమాలో కూడా రాశినే ఫిక్స్ చేసారని తెలుస్తుంది. ఇక పక్కా కమర్షియల్ అన్న టైటిల్ కి తగ్గట్టే ప్రతిదీ కమర్షియల్ గా ఆలోచించే యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Acharya movie : ఖమ్మంలో ఆచార్య మూవీ షూటింగ్.. బొగ్గుగనుల వద్ద భారీగా అభిమానులు.. పోలీసుల బందోబస్త్
Anasuya Bharadwaj : అందాల అనసూయ ‘ఖిలాడి’గా కనిపించనుందా.. నెగిటివ్ రోల్‌లో రంగమ్మత్త..?