NTR : ఆ వీడియోను చూడొద్దు.. షేర్ చేయొద్దు..! చుట్టుమల్లె సాంగ్ ఫేక్ వీడియోపై స్పందించిన ఎన్టీఆర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  టెక్నాలజీ అందుబాటులోకి చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇదే టెక్నాలజీని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహిళల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తీవ్రమైన సమస్యగా మారుతోంది

NTR : ఆ వీడియోను చూడొద్దు.. షేర్ చేయొద్దు..! చుట్టుమల్లె సాంగ్ ఫేక్ వీడియోపై స్పందించిన ఎన్టీఆర్
Ntr

Updated on: Oct 03, 2026 | 1:51 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  టెక్నాలజీ అందుబాటులోకి చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇదే టెక్నాలజీని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహిళల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తీవ్రమైన సమస్యగా మారుతోంది. తాజాగా దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్  మార్ఫింగ్ వీడియోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో నిజమైనది కాదు, AI టెక్నాలజీ సహాయంతో రూపొందించిన మార్ఫ్డ్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్‌ను క్రియేట్ చేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీని పై ఎన్టీఆర్ స్పందించారు. మహిళలను అవమానించే విధంగా రూపొందించిన ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ ప్రోత్సహించకూడదని కోరారు తారక్. వీడియోను చూడటం, డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు పంపడం లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మళ్లీ పోస్ట్ చేయడం వంటివి చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఒకరి ఫొటో లేదా వీడియోను వారి అనుమతి లేకుండా మార్చి అసభ్యకరంగా లేదా అవమానకరంగా చూపించడం కేవలం సోషల్ మీడియా ట్రెండ్‌గా చూడకూడదని, బాధితులపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని పేర్కొన్నారు. అలాగే ఈ మార్ఫింగ్ వీడియోను రూపొందించిన వారిని, దాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు తారక్.

ఈరోజు బాధితురాలు మరొకరు కావచ్చు. రేపు మన కుటుంబంలోని మహిళ కూడా ఇలాంటి దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంది అని అన్నారు ఎన్టీఆర్.  AI వాడి డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ కంటెంట్‌కు సంబంధించి దేశంలో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. 2026లో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు  హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు సంబంధించినట్లు రూపొందించిన AI అభ్యంతరకర చిత్రాలు, వీడియోలను ప్రచారం చేశారనే ఆరోపణలపై ముగ్గురిని అరెస్టు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us