యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు మొదలయ్యి. అంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి జనతా గ్యారేజ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల అలరించడానికి రెడీ అవుతున్నారు. ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాను అదిరిపోయే కథతో తెరకెక్కిస్తున్నాడు. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
ఇటీవలే దేవర సినిమానుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా సముద్రం బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే దేవర మొదటి పార్ట్ రిలీజ్ పై ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చాయి. ఆగస్ట్ లో దేవర సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అదే ఆగస్టు లు పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కానుంది. దాంతో దేవర సినిమా రిలీజ్ వాయిదా పడిందని టాక్ వినిపిస్తుంది. దేవర సినిమాను జూన్ లోకాని.. జులై లో కానీ రిలీజ్ చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
This is just a glimpse of my world we created. Hope you all liked it🤗. @tarak9999 annayya as #Devara#DevaraGlimpse https://t.co/9fhmcV0OEF
— Siva Koratala (@SivaKoratala) January 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.