Nivetha Thomas-Kilimanjaro: ‘నివేదా థామస్’ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమాతో తెలుగునాట తెరంగేట్రం చేసిన నివేదా అనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులను సంపాదించుకుంది. తన సహజ నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. విభిన్నమైన కథా ఎంపికలతో.. సినిమా సినిమాకు వేరియేషన్ చూపుతూ అద్భుత నటనతో వావ్ అనిపించుకుంటున్న నివేదా థామస్ తాజాగా సరికొత్త ఫీట్ సాధించింది. ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరు గాంచిన కిలిమంజారోను నివేదా అధిరోహించింది. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించింది. కిలిమంజారోని అధిరోహించిన నివేదా.. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. కిలిమంజారోను అధించిన ఫోటోను నివేదా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది.
ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరుగాంచిన కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. మీటర్లలో అయితే 5,895. ఇంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడం అనేది ఎంతో సాహసంతో కూడిన పని. అయినప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా, దాదాపు 6 నెలల పాటు కఠోర శిక్షణ పొందిన నివేదా థామస్ తన కల నెరవేర్చుకుంది. నివేదా అభిరుచుల్లో ట్రెక్కింగ్ కూడా ఉంది. కాగా, కిలిమంజారోను అధిరోహించినప్పటి ఫొటోలను నివేదా సోషల్ మీడియాలో పంచుకోగా.. అభిమానులు అమెను అభినందిస్తున్నారు. నివేదాకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
I made it ?
To the top of the tallest free standing mountain in the world. Mount Kilimanjaro pic.twitter.com/InPptVTjit— Nivetha Thomas (@i_nivethathomas) October 23, 2021
Also read: