
టాలీవుడ్ హీరో నితిన్ ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతకొన్నాళ్లుగా ఈ హీరోకు అసలైన మూవీ పడలేదనే చెప్పాలి. గతేడాది ‘ఎక్స్ ట్రా ఆర్టినరీ మ్యాన్’ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. విడుదలకు ముందే ఎంతో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టారు నితిన్. కంటెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’ సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. భీష్మ తర్వాత వీరద్దరి కాంబోలో వస్తున్న మూవీ ఇది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో నితిన్ లుక్స్, డైలాగ్స్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
తాజాగా విడుదలైన రాబిన్ హుడ్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ మాటల్లోని కనికట్టో.. నితిన్ లుక్స్ చేసే మేజిక్కో తెలీదు కానీ.. గ్లింప్స్ మాత్రం క్యాచీగా… బ్రైన్ ఫీస్ట్ గా ఉంది. అంతేకాదు ఈ సినిమాలో నితిన్ దొంగ అనే విషయాన్ని బయటపెట్టేసింది. అది కూడా.. తన పర అని తేడా లేకుండా దోచేసి.. దాచేసే క్యారెక్టర్ అని.. ఫన్నీగానే ఆ క్యారెక్టర్ ఉండనుందనే క్లారిటీ కూడా అందరికీ వచ్చేసింది. అందుకే ఈ గ్లింప్స్.. అప్పుడే ఈ సినిమా పై బజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు యూట్యూబ్‌లోను మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను రాబట్టుకుంటూ దూసుకుపోతోంది. కానీ సర్‌ప్రైజింగ్‌లీ… గ్లింప్స్.. కాన్సెస్ట్ సూపర్ కానీ… నితిన్ ప్రీవియస్ సినిమాల్లా హిట్ మ్యాటరే లేకుండా పోదు కదా.. అనే కామెంట్ కూడా… సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ముందుగా రష్మిక మందన్నాను కథానాయికగా అనుకున్నారు. ఆ తర్వాత శ్రీలీల పేరు వినిపించింది. కానీ హీరోయిన్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలను ప్రకటించనున్నారు మేకర్స్. అయితే కొన్నాళ్లుగా నితిన్ ఖాతాలో సరైన హిట్ పడడం లేదు. మరీ ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోన్న రాబిన్ హుడ్ హిట్ అవుతుందో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.