
ఆమె వేసుకున్న డ్రెస్ కంటే, కాళ్లకు ధరించిన చెప్పుల ధర వింటే సామాన్యుల గుండె ఆగిపోవాల్సిందే. ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాది పొడవునా గడిపేసేంత ఖర్చు కేవలం ఒక జత చెప్పులకే పెట్టిన ఆ బ్యూటీ విలాసవంతమైన జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆమె ఒకప్పుడు తెలుగులో ఒక అడల్ట్ కామెడీ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఆమె దశ తిరిగిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆ భామ, తాజాగా తన గోవా ట్రిప్ ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోల్లో ఆమె అందం కంటే, ఆమె ధరించిన ఒక లగ్జరీ వస్తువు ధర ఇప్పుడు నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఆ ఖరీదైన సుందరి మరెవరో కాదు.. నిక్కీ తంబోలి.
నిక్కీ తంబోలి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘కాంచన 3’, ‘తిప్పరా మీసం’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో ఐటమ్ సాంగ్స్ పై ఫోకస్ పెట్టింది. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్‌లో సెకండ్ రన్నరప్‌గా నిలిచి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘ద 50’ అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
తాజాగా నిక్కీ తంబోలి తన సహకంటెస్టెంట్లతో కలిసి గోవా వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ బ్లూ కలర్ పొట్టి డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందరూ ఆమె డ్రెస్ గురించి మాట్లాడుకుంటారని అనుకుంటే, నెటిజన్ల దృష్టి మాత్రం ఆమె హీల్స్ పై పడింది. అవి ‘డాల్స్ అండ్ గబ్బానా’ అనే అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌కు చెందిన హీల్స్. వాటి ధర అక్షరాలా లక్ష 46 వేల రూపాయలు అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.
కేవలం చెప్పులే కాదు, నిక్కీ వాడే ప్రతి వస్తువు ఎంతో ఖరీదైనదని సమాచారం. ఆమె మేకప్, చర్మ సౌందర్యం కోసం పెట్టే ఖర్చు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అర్బాజ్ పటేల్ స్వయంగా ధ్రువీకరించాడు. ఆమె వాడే మాయిశ్చరైజర్ ధర రూ.75 వేలు కాగా, కేవలం ముఖానికి రాసుకునే సీరమ్ ధర రూ.50 వేలు అని ఆయన వెల్లడించాడు.
అలంకరణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడం నిక్కీకి చిన్నప్పటి నుండి ఉన్న అలవాటని తెలుస్తోంది. గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే మెయింటెనెన్స్ ఉండాలి కానీ, నిక్కీ తంబోలి రేంజ్ చూస్తుంటే అది నెక్స్ట్ లెవల్ లో ఉందనిపిస్తోంది. కేవలం ఒక జత చెప్పుల కోసం ఇంత ఖర్చు చేయడం అవసరమా అని కొందరు అంటుంటే, సంపాదించిన డబ్బును తమకు నచ్చినట్లు ఖర్చు పెట్టుకోవడంలో తప్పులేదని ఆమె అభిమానులు సమర్థిస్తున్నారు.