Niharika: ఇట్స్‌ అఫీషియల్‌.. విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య.. రెండేళ్లకే ముగిసిన పెళ్లి బంధం

|

Jul 04, 2023 | 8:50 PM

ఇట్స్‌ అఫీషియల్‌.. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల- జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పర విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. కోర్టు కూడా వీరికి విడాకులు మంజూరు చేసినంది. నిహారిక- చైతన్యలు 2020 డిసెంబర్‌ 9వ తేదీన వివాహం చేసుకున్నారు.

Niharika: ఇట్స్‌ అఫీషియల్‌.. విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య.. రెండేళ్లకే ముగిసిన పెళ్లి బంధం
Niharika Konidela, Chaitan
Follow us on

ఇట్స్‌ అఫీషియల్‌.. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల- జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పర విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. కోర్టు కూడా వీరికి విడాకులు మంజూరు చేసింది. నిహారిక- చైతన్యలు 2020 డిసెంబర్‌ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే రెండేళ్లకే వీరి పెళ్లి బంధం పెటాకులైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు నిహారిక- చైతన్య. ఇక ఆ మధ్యన చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. దీంతో మొదటిసారిగా వీరి బ్రేకప్‌ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు నిహారిక కూడా చైతన్య ఫొటోలన్నింటినీ తొలగించింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్లు, ఫంక్షన్లకు నిహారిక సింగిల్‌గా రావడంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడీ రూమర్లే నిజమయ్యాయి. నిహారిక– చైతన్య దంపతులు అధికారికంగా విడిపోయారు.

కాగా మెగా బ్రదర్ నాగబాబు వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక. మొదట్లో యాంకర్ గా, హోస్ట్ గా అదృష్టం పరీక్షించుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో కథానాయికగా ఆకట్టుకుంది.  అలాగే ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్నకూచి, మ్యాడ్‌ హౌస్‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, డెడ్‌ పిక్సెల్స్‌ వంటి సినిమాలు, సిరీస్‌లకు నిర్మాతగా వ్యవహరించింది.  ఇక 2020 డిసెంబర్ లో టెక్ ఉద్యోగి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే  ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వీరి బంధం  మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..