Bichagadu 2: బిచ్చగాడు2 నుంచి అదిరిపోయే అప్డేట్ అంచనాలను పెంచేసిన వీడియో..

తమిళ్‌‌‌‌లో వచ్చిన పిచ్చైకారన్ సినిమాను బిచ్చగాడు అనే టైటిల్‌‌‌తో తెలుగులో విడుదల చేశారు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌‌‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడా.. ఇక్కడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Bichagadu 2: బిచ్చగాడు2 నుంచి అదిరిపోయే అప్డేట్  అంచనాలను పెంచేసిన వీడియో..
Bichagadu 2

Updated on: Feb 10, 2023 | 7:41 PM

మల్టీటాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బిచ్చగాడు 2. బిచ్చగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు హీరో విజయ్ ఆంటోని. తమిళ్‌‌‌‌లో వచ్చిన పిచ్చైకారన్ సినిమాను బిచ్చగాడు అనే టైటిల్‌‌‌తో తెలుగులో విడుదల చేశారు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌‌‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడా.. ఇక్కడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని అమ్మ సెటిమెంట్ ప్రతిఒక్కరిని కదిలించింది. క్లాస్ మాస్ అనే తేడాలేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది బిచ్చగాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తోన్నారు. పిచ్చైకారన్2 అనే టైటిల్‌‌‌‌తో ఈ సినిమా తెరకెక్కిస్తోన్నారు. అలాగే ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ వీడియోలో విలన్ పాత్రను పరిచయం చేశారు. ఈ అలాగే ఇందులో బ్రెన్ మార్పిడి గురించి వివరించారు. అయితే మేదావుల మెదడును వారి ఆలోచనలను బ్రెయిన్ మార్పిడి ద్వారా బ్రతికించవచ్చు అని తెలిపారు.

అయితే హిట్లర్ లాంటి వారి బ్రెయిన్‌తో ఎవరైనా ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తే ఎలా అనే ప్రశ్నతో ఈ వీడియో ముగుస్తోంది. ఇక విజయ్ బిచ్చగాడు కంటే ముందు అంతకుముందు శ్రీకాంత్ మహాత్మ, రవితేజ దరువు చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ఆయన నకిలీ, సలీమ్ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఆతర్వాత అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన బిచ్చగాడు సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ బిచ్చగాడు 2ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తూనే దర్శకత్వం, సంగీతం, ప్రొడక్షన్ బాధ్యతల్ని కూడా చూసుకుంటున్నారు విజయ్ ఆంటోని. ఈక్రమంలో మలేషియాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగానే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడీ హీరో.