
Vishal: సోషల్ మీడియాలో ఏ చిన్న విషయమైన అది పెద్ద సంచలనం గా మారుతుంది. సెలబ్రేటీల విషయంలో మరీను.. వారిపై ప్రశంసలు కురిపించే నేటిజన్లే తేడావస్తే ట్రోలింగ్ తో ఆడుకుంటారు. పొరపాటున నోరు జారి ఏదైనా అన్నారో ఖాతం ట్రోల్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఇప్పుడు అలాంటి ట్రోలింగ్ నే ఎదురుకుంటున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ను కలిశారు విశాల్. ఆయన తోపాటుగా విశాల్ సోదరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ గురించి, సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, సమాజిక సేవ పై ఆయనతో చర్చించినట్లు విశాల్ తెలిపారు. ఈ విషయాన్నీ అబిమనులతో పంచుకోవాలన్న కుతూహలం లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇక్కడే విశాల్ ట్రోల్ లో కాలేశారు.
వెంకయ్య నాయుడిని కలిసిన సమయంలో తీసిన ఫోటోను షేర్ చేసిన విశాల్. కంగారులో వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి అని రాసుకోచ్చారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిసి సందర్భంగా రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలవడం సంతోషంగా ఉందన్న హీరో విశాల్. అంతే ఎవరికీ దొరకకుడదో వాళ్ళకే దొరికారు. వెంటనే ట్రోలింగ్ ను షూరూ చేశారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాదు. నాయన ఆయన ఉప రాష్ట్రపతి అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దాంతో తప్పుతెలుసుకున్న విశాల్ వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసి మరో పోస్ట్ ను షేర్ చేశాడు. ఏది ఏమైనా తప్పు చేసి నెటిజన్లకు దోర్కకుడదబ్బా…
మరిన్ని ఇక్కడ చదవండి :