కుమారీ ఆంటీ ఫుడ్ బాలేదన్న బిగ్ బాస్ బ్యూటీ.. కట్ చేస్తే ట్రోల్ చేయకండి అంటూ ఇలా..

సోషల్ మీడియా పుణ్యమా అని కుమారీ ఆంటీ పేరు మారుమ్రోగింది. సోషల్ మీడియాలో వీడియోలు చేసే నెటిజన్స్ ఆమె గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఆ వీడియోలో కుమారీ ఆంటీ చూపిన డైలాగ్ తెగ ఫెమస్ అయ్యింది. మీది మొత్తం 1000 అయ్యింది రెండు లివర్లు ఎక్స్ ట్రా అనే డైలాగ్ తెగ వైరల్ గా మారింది.

కుమారీ ఆంటీ ఫుడ్ బాలేదన్న బిగ్ బాస్ బ్యూటీ.. కట్ చేస్తే ట్రోల్ చేయకండి అంటూ ఇలా..
Keethy Bhat

Updated on: Mar 22, 2024 | 8:37 AM

కుమారి ఆంటీ.. ఈ మధ్యకాలంలో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఆంటీ ఓవర్ నైట్ లో పౌలారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా పుణ్యమా అని కుమారీ ఆంటీ పేరు మారుమ్రోగింది. సోషల్ మీడియాలో వీడియోలు చేసే నెటిజన్స్ ఆమె గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఆ వీడియోలో కుమారీ ఆంటీ చూపిన డైలాగ్ తెగ ఫెమస్ అయ్యింది. మీది మొత్తం 1000 అయ్యింది రెండు లివర్లు ఎక్స్ ట్రా అనే డైలాగ్ తెగ వైరల్ గా మారింది. దాంతో ఆమె దగ్గరకు జనాలు ఎగబడ్డారు. భారీగా జనం కుమారీ ఆంటీ షాప్ కు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీసులు ఆమె షాప్ ను తొలగించాలని ఆదేశించారు. దాంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాని గురించి చర్చ జరిగింది. మీడియా ఛానెల్స్ లోనూ దీని గురించి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

ఆమె షాప్ ను తొలగించవద్దు అని పోలీసులను ఆదేశించారు. అలాగే త్వరలోనే ఆమె షాప్ ను సందర్శిస్తాను అని తెలిపారు. ఇదిలా ఉంటే చాలా మంది కుమారీ ఆంటీ దగ్గర భోజనం చేశారు. సెలబ్రెటీలు కూడా ఆమె ఫుడ్ తినడానికి వెళ్లారు. అలాగే బిగ్ బాస్ బ్యూటీ , సీరియల్ నటి కీర్తి భట్ కూడా కుమారీ ఆంటీ ఫుడ్ తిన్నది. అయితే ఆమె చేసినాజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కుమారీ ఆంటీ ఫుడ్ బాలేదు అని కారం ఎక్కువగా ఉంది అని తెలిపింది.

దాంతో ఆమెను నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు. కీర్తిభట్ ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దీని పై కీర్తిభట్ దంపతులు స్పందించారు. మేము కుమారీ ఆంటీ గురించి చేసిన వీడియో పై కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మేము తెలంగాణవాళ్ళం, ఆంద్రావాళ్ళం  మేము కరం ఎక్కువ తింటాం.. నీకు కారం ఎక్కువేయితే కర్ణాటక వెళ్లిపోండి.. అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మేము అలా అనలేదు. నేను రాయలసీమ వాడినే నేను కారం ఎక్కువ తింటా.. ఆ వీడియో పూర్తిగా చూడండి. చికెన్ కరీలో మాత్రమే కారం ఎక్కువగా ఉంది అని మేము అన్నాం.. మేము చెప్పడం వల్లే కుమారీ ఆంటీకి నష్టం జరిగినట్టు కామెంట్స్ చేస్తున్నారు అని అన్నారు కీర్తీ భట్ దంపతులు. మా వల్ల బిజినెస్ లాస్ కావడం ఏంటి? తినేవాడు ఎలాగైనా తింటాడు. మేం చెప్పగానే వాళ్లకి లాస్ రాదు అంటూ ఈ జంట వీడియో షేర్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.