Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి మరో సాంగ్ రిలీజ్.. వేలాది విద్యార్థుల మధ్య చిత్రయూనిట్ డాన్స్..

|

Jan 11, 2023 | 3:29 PM

వాల్తేరు వీరయ్య సినిమా ఐదోపాటను మల్లారెడ్డి యూనివర్సిటీ లో చిత్ర బృందం విడుదల చేసింది. వేలాదిమంది విద్యార్థుల మధ్య జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సినిమా బృందం నీకేమో అందమెక్కువ పాటను విడుదల చేశారు.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి మరో సాంగ్ రిలీజ్.. వేలాది విద్యార్థుల మధ్య చిత్రయూనిట్ డాన్స్..
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి… శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న చిత్రం వాల్తేరు వీరయ్య.. చిరు వీరాభిమాని డైరెక్టర్ బాబీ రూపొందిస్తోన్న ఈ చిత్రంలో కీలకపాత్రలో మాస్ మాహారాజా రవితేజ నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకోగా.. ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో అంటే జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. వాల్తేరు వీరయ్య సినిమా ఐదోపాటను మల్లారెడ్డి యూనివర్సిటీ లో చిత్ర బృందం విడుదల చేసింది. వేలాదిమంది విద్యార్థుల మధ్య జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సినిమా బృందం నీకేమో అందమెక్కువ పాటను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాబి, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్, ప్రొడ్యూసర్ రవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులతో కలిసి వాల్తేరు వీరయ్య పాటలకు డాన్స్ వేసి ఆకట్టుకున్న చిత్ర బృందం ఈ నెల 13 న సినిమాను థియేటర్ లలో ప్రతి ఒక్కరు చూడాలని కోరారు.

ఈ చిత్రం నుంచి విడుదలైన నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువా అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. చిరు.. శ్రుతి హాసన్ మధ్య సాగే డ్యుయేట్ ట్రాక్ మాస్ స్టైలిష్ టచ్ తో కొత్తగా సాగుతుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించగా.. మికా సింగ్, గీతామాధురి, డీ వెల్మురుగన్ పాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.