
తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో నాని ఒకరు. పక్కింటి అబ్బాయిలా.. సహజ నటనతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. నిజానికి తెలుగులో నానికి.. ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విభిన్న కంటెంట్ కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. హిట్ 3, దసరా వంటి చిత్రాలతో మాస్ హీరోగానూ మెప్పించారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో నాని డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. తెలుగులో తన క్రష్ ఎవరనేది బయటపెట్టారు. అప్పట్లో తనకు ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టమని.. ఆమె తన క్రష్ అని వెల్లడించారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తను మరెవరో కాదండి హీరోయిన్ స్నేహ.
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..
నానిని తన చైల్డ్‌హుడ్ క్రష్ గురించి అడగగా, ఆయన తడుముకోకుండా అలనాటి తార శ్రీదేవి గారంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని తెలిపారు. ఆరాధ్య భావంతో ఆమెను అభిమానించేవారని పంచుకున్నారు. అంతేకాకుండా, సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తాను పనిచేసిన మొదటి సినిమాలో హీరోయిన్ స్నేహపై చిన్న క్రష్ ఏర్పడిందని నాని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో స్నేహ పెళ్లి కాలేదని, అందుకే అది వాలిడ్ క్రష్‌గా అనిపించిందని నాని సరదాగా చెప్పుకొచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
మరోవైపు, నజ్రియా తన బాల్యపు క్రష్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని పేర్కొన్నారు. చిన్నతనంలో మమ్ముట్టి లాంటి వారిని పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెప్పేవారని నజ్రియా గుర్తు చేసుకున్నారు. కాలక్రమేణా ఆమె ఇష్టం ఫహద్ ఫాసిల్, బ్రాడ్లీ కూపర్ వంటి నటుల వైపు మళ్లిందని కూడా తెలిపారు. డైరెక్టర్ వివేక్ మాట్లాడుతూ.. అమల అంటే తనకు చిన్నప్పుడు క్రష్ అని అన్నారు. సత్య, శివ వంటి చిత్రాలలో ఆమెను చూసి అమితంగా ఆరాధించానని చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్..
Nani, Sneha
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..