
నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో వస్తున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. సీనియర్ దర్శకుడు వైవీఎస్ తో కలిసి తన మొదటి సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక నటనకు సంబంధించి ఎన్టీఆర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. దీనిని చూసిన నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోయారు. కటౌట్ అదిరిపోయిందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోన్న ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి జానకీరామ్ కుమారుడు ఎన్టీఆర్‌కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.
వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో మా రామ్ హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది గర్వించదగిన సమయం. అతనికి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం ఉంటుందని నమ్ముతున్నాను. జానకిరామ్ తనయుడిగా, నా దివంగత హరికృష్ణగారి మనవడిగా, ఎన్టీఆర్‌గారి మునిమనవడిగా మా కుటుంబ వారసత్వాన్ని మరింత గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం నాకు ఉంది’ అని ట్వీట్ చేశారు నారా భువనేశ్వరి. దీంతో పాటు రామ్ ఫొటోను కూడా అందులో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
/h3>
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.