నందమూరి తారకరత్న గుండెపోటుతో హాస్పటల్ లో చేరిన విషయం తెలిసిందే. లోకేష్ పాదయాత్రలో అకస్మాత్తుగా తారక్ రత్న గుండెపోటుతో పడిపోయారు. ఆయనను బెంగుళూరులోని హృదయాలయ హాస్పటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తారకరత్న ఆరోగ్యంపై మరోసారి స్పందించారు నందమూరి కళ్యాణ్ రామ్. గతంలో కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా తారకరత్న ఆరోగ్యం గురించి స్పందిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా మరోసారి తారకరత్న ఆరోగ్యం పై స్పందించారు కళ్యాణ్ రామ్.
కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా రీసెంట్ గ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం లో నటించి ఆకట్టుకున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్యం పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తారకరత్న కోలుకుంటున్నారని చెప్పిన కళ్యాణ్ రామ్.. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వడానికి తాను మెడికల్ ఎక్స్ పర్ట్ ను కాదని అన్నారు. ఎక్స్ పర్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో తారకరత్న త్వరగానే పూర్తిగా కోలుకుంటారనే నమ్మకం తనకుందని చెప్పుకొచ్చారు.