Akhanda Trailer: మీకు సమస్య వస్తే దండం పెడతారు.. మేం ఆ సమస్యకే పిండం పెడతాం: పవర్ ఫుల్ డైలాగులతో కేక పుట్టించిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.

Akhanda Trailer: మీకు సమస్య వస్తే దండం పెడతారు.. మేం ఆ సమస్యకే పిండం పెడతాం: పవర్ ఫుల్ డైలాగులతో కేక పుట్టించిన బాలయ్య
Akhanda

Updated on: Nov 14, 2021 | 7:58 PM

Akhanda Trailer: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్టే‌గా సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు దీపావళి తరువాత మరో పండుగను అందించారు. దీవతో సోషల్ మీడియాలో బాలయ్య సందడితో షేక్ అవుతోంది.

ఆదివారం, నవంబర్ 14న సాయంత్రం 7:09 గంటలకు ట్రైలర్‌ను నెట్టింట్లోకి వదిలారు. బాలయ్య బాబు డైలాగ్స్‌కు సోషల్ మీడియా ఊగిపోతోంది. ట్రైలర్‌లో ముందుగా ‘విధికి విధాతకు విశ్వానికి సవాళ్లు విసరకూడదు’..డైలాగ్‌తో మొదలవుతోంది. ట్రైలర్‌ను డైలాగులతో నింపేశారు. ‘అంచనా వేయడానికి పోలవరం డ్యామా.. పట్టిసీమ తూమా.. పిల్ల కాలువ’ అంటూ పవర్ డైలాగ్‌తో బాలయ్య కేక పుట్టించాడు. ‘అఖండ.. నేనే నేనే’ అంటూ నటసింహం పేల్చిన డైలాగులు నెట్టింటిని షేక్ చేస్తోంది.

బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో అలరించేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు, టీజర్లతో సినిమాపై భారీగానే హోప్స్ పెరిగాయి. బాలయ్య బాబుతో ప్రగ్యా జైస్వాల్ రోమాన్స్ చేయనుండగా, ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: