Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ లవ్ ఆంథేమ్ ప్రోమ్ రిలీజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ లవ్ ఆంథేమ్ ప్రోమ్ రిలీజ్..
Radhe Shyam

Edited By:

Updated on: Nov 29, 2021 | 8:09 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో డార్లింగ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోస్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో రాధేశ్యామ్ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు నెట్టింట్లో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక గత కొద్ది రోజులుగా రాధేశ్యామ్ నుంచి వరుస అప్డేట్ ఇస్తూ.. అభిమానులను ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ క్రమంలోనే వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ టీజర్‏ హిందీ వెర్షన్‏ను నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాసేపటి క్రితం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‏లను లాంచ్ చేశారు. ఇక తాజాగా విడుదలైన నగుమోము తారాలే సాంగ్ టీజర్‍లో మ్యూజిక్‏తోపాటు.. ప్రభాస్, పూజాహెగ్డే లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి హెల్త్ బులెటిన్ విడుదల.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

Bigg Boss 5 Telugu Ravi: యాంకర్ రవి పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే.. బిగ్‏బాస్ విన్నర్ కంటే ఎక్కువ తీసుకున్నాడా ?..

Kamal Haasan: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైద్యులు.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..

Taapsee Pannu: అందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డాను.. కానీ.. ఆసక్తికర విషయాలను చెప్పిన తాప్సీ..

Loading...
Unable to load recommendations.
Follow Us