Love Story: బాక్సాఫీస్ వద్ద లవ్ స్టోరీ ప్రభంజనం.. రెండవ రోజు కలెక్షన్స్ ఎంతంటే..

|

Sep 26, 2021 | 11:51 AM

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24న విడుదలైన

Love Story: బాక్సాఫీస్ వద్ద లవ్ స్టోరీ ప్రభంజనం.. రెండవ రోజు కలెక్షన్స్ ఎంతంటే..
Follow us on

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్‏తో దూసుకుపోతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస వాయిదాల అనంతరం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో లేదో అని నిర్మాతలు.. డైరెక్టర్, చిత్రయూనిట్ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. కానీ వారి అంచనాలకు మించి మొదటి రోజు నుంచే రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఈ సినిమా విడుదలకు ముందే నెట్టింట్లో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి, నాగచైతన్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు అధ్బుతమనే చెప్పాలి. లవ్ స్టోరీ సినిమా కోసం ప్రేక్షకులు జై కొట్టారు. థియేటర్లలో చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి నెలకొంది. హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తుండగా.. ఆన్ లైన్‏లో టికెట్స్ దొరకని పరిస్థితి వచ్చింది. ఇక మొదటి రోజు వసూళ్ల పరంగా రికార్డ్స్ సృష్టించిన లవ్ స్టోరీ సినిమా రెండవ రోజు కూడా దూసుకుపోయింది. ఇక తొలి రెండు రోజులలో లవ్ స్టోరీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 17.21 కోట్ల రూపాయాలను వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. మొత్తంగా రూ. 17.21 కోట్లు వసూలు చేసి.. నిర్మాతలకు ఊహించలేని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈరోజు ఆదివారం.. కూడా ఈ మూవీ భారీ వసూళ్లను సాధించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన నాగచైతన్య, సాయి పల్లవిల అందమైన ప్రేమకథ..ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. విజయపథంలో దూసుకుపోతుంది.

Also Read: Deva Katta: ఇండస్ట్రీకి నాపై నమ్మకం పోయింది.. డైరెక్టర్ దేవా కట్టా షాకింగ్ కామెంట్స్..

Rana Daggubati: సరికొత్త అవతారం ఎత్తనున్న రానా.. విరాట పర్వం కోసం కొత్త ప్రయోగం..