Naga Chaitanya: ఆ సినిమా అంటే చాలా ఇష్టం.. ఒక 50 -60 సార్లు చూసుంటాను.. నాగచైతన్య..

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. చివరగా తండేల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో చైతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. అందులో తనకు ఇష్టమైన సినిమా గురించి చెప్పారు చైతూ.

Naga Chaitanya: ఆ సినిమా అంటే చాలా ఇష్టం.. ఒక 50 -60 సార్లు చూసుంటాను.. నాగచైతన్య..
Naga Chaitanya

Updated on: Jul 13, 2026 | 9:20 PM

అక్కినేని నాగచైతన్య సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అటు ఫ్యామిలీ ప్రేక్షకులను, ఇటు యువతను ఆకట్టుకునే చిత్రాలతో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. చివరగా తండేల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే చైతూ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో శైలజ రెడ్డి అల్లుడు ఒకటి. మారుతి దాసరి దర్శకత్వంలో, ఎస్. నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మాణంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే గతంలో ఈ సినిమా నిర్మాణ సమయంలో, ప్రమోషన్లలో భాగంగా, రమ్యకృష్ణ, నాగ చైతన్య తమ పని అనుభవాలను, ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలను పంచుకున్న కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే చైతన్య తనకు ఇష్టమై సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

రమ్యకృష్ణతో కలిసి పని చేయడంపై నాగ చైతన్య తన ప్రారంభ భయాన్ని వ్యక్తం చేశారు. “మొదట్లో చాలా నెర్వస్‌గా అనిపించింది,” అని ఆయన తెలిపారు. తన చిన్నతనంలో తన తండ్రి నాగార్జున, రమ్యకృష్ణ నటించిన చిత్రాలను తాను చూసేవాడినని.. ముఖ్యంగా “హలో బ్రదర్” వంటి చిత్రాలను తాను 50-60 సార్లు చూశానని చైతన్య గుర్తు చేసుకున్నారు. అలాంటి గొప్ప నటి పక్కన పూర్తి నిడివి పాత్ర చేయాల్సి వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలిగిందని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

అయితే, రమ్యకృష్ణ తనను చాలా మద్దతు ఇచ్చారని, ముఖ్యంగా ఒక సన్నివేశంలో తన డైలాగ్‌లు, ఎక్స్‌ప్రెషన్స్‌ బాగున్నాయని ఆమె ప్రశంసించడం తనకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చిందని నాగ చైతన్య తెలిపారు. “ఒక సీనియర్ నటి అలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు అది మాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది,” అని ఆయన అన్నారు. రమ్యకృష్ణతో కలిసి పని చేయడం ఒక గొప్ప అనుభూతి అని, ఆమె నుండి తాను చాలా నేర్చుకున్నానని చైతన్య పేర్కొన్నారు. “మీలాంటి వారు ఎందుకు ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ప్రేక్షకులు మిమ్మల్ని ఎందుకు నిరంతరం ప్రేమిస్తారో తెలుసుకోవడానికి నాకు అవకాశం దక్కింది,” అని ఆయన రమ్యకృష్ణను ఉద్దేశించి అన్నారు. దీనికి రమ్యకృష్ణ “థాంక్యూ, దట్స్ సో నైస్ కదా” అని బదులిచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

Follow Us