అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీలో చైతూ కీలకపాత్రలో కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇక ఇటీవల థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతూ.. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మూవీ ప్రమోషన్లలో ఉన్న చై.. త్వరలోనే సక్సెస్ ఫుల్ డైరెక్ట్ర విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలపై చర్చలు జరుగుతున్నాయని.. ఇటీవలే చైతూ విమల్ కృష్ణను కలిసి.. స్క్రీప్ట్ విన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో అధికారిక ప్రకటన రానుందని.. అన్ని కుదిరితే సెప్టెంబర్ నెలలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య తనను తాను ఏ జానర్‌లో పెట్టుకోవడానికి అనుమతించడం లేదు. ప్రేమకథల నుంచి యాక్షన్-డ్రామా వరకు విభిన్నమైన చిత్రాలను ట్రై చేస్తున్నాడు. ఇక చైతూ ధూత సిరీస్ తో ఓటీటీ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి తెలుగు ఒరిజినల్ నేచురల్ హారర్ చిత్రం. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ మరియు తరుణ్ భాస్కర్ దాస్యం తదితరులు నటించారు.