Nagendra Babu: ‘వరుణ్‌ తేజ్‌కు సాయి పల్లవికి పెళ్లి’.. స్పందించిన నాగబాబు.. వైరల్‌ అవుతోన్న రియాక్షన్‌..

|

Apr 06, 2021 | 11:13 AM

Nagendra Babu: టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఒకరు. ఇటీవల చెల్లెలు నిహారిక వివాహం జరగడంతో ఇప్పుడు అందరి దృష్టి వరుణ్‌ తేజ్‌పై పడింది. వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ఈ యంగ్‌ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా?...

Nagendra Babu: వరుణ్‌ తేజ్‌కు సాయి పల్లవికి పెళ్లి.. స్పందించిన నాగబాబు.. వైరల్‌ అవుతోన్న రియాక్షన్‌..
Varun
Follow us on

Nagendra Babu: టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఒకరు. ఇటీవల చెల్లెలు నిహారిక వివాహం జరగడంతో ఇప్పుడు అందరి దృష్టి వరుణ్‌ తేజ్‌పై పడింది. వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ఈ యంగ్‌ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా? అని ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తండ్రి నాగబాబు ఏ ఇంటర్వ్యూలో కనిపించినా సరే ముందుగా వినిపించే ప్రశ్న.. ‘సార్‌.. వరుణ్‌ పెళ్లి ఎప్పుడు.?’
అయితే తాజాగా ఈ క్రమంలోనే ఓ అభిమాని వరుణ్‌ వివాహం గురించి అడిగిన ప్రశ్నకు ఫన్నీగా కామెంట్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న నాగబాబును.. ‘వరుణ్‌ అన్న, సాయి పల్లవికి పెళ్లి చేస్తా సార్‌.. జోడీ బాగుటుందని’ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దీంతో ఈ కామెంట్‌కు స్పందించిన నాగబాబు కూల్‌గా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. దీనికి ఎలాంటి కామెంట్‌ చేయకుండా… జాతి రత్నాలు సినిమాల్లో బ్రహ్మానందం వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో బ్రహ్మానందం చెప్పే ‘తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే’ అనే డైలాగ్‌తో నాగబాబు పంచ్ వేశాడు. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక అంతకు ముందు కొందరు నెటిజన్లు కూడా వరుణ్‌ తేజ్‌ వివాహంపై నాగబాబును పలు ప్రశ్నలు అడిగారు. ‘వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘మంచి సంబంధాలు ఉంటే చూడండి’ అని సమాధానం ఇచ్చాడు.

Nagababu

Sai Pallavi

Also Read: ఏప్రిల్‌ 7న పుష్పరాజ్ పరిచయం.. సాయంత్రం బన్నీ పుష్ప లుక్ రిలీజ్.. ఆగస్టు 13న థియేటర్లలో సందడి..

యూట్యూబ్ ట్రెండింగ్‏లో నెంబర్ వన్‏గా బండ్ల గణేష్… పవన్ కళ్యాణ్ గారి మూవీ ఫంక్షన్ యందు ఈయన స్పీచ్ వేరయా..

మహేష్ డైరెక్టర్‏తో అల్లు అర్జున్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. త్వరలోనే సెట్స్ పైకి..