టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి, ముస్తఫా వివాహం చెల్లదంటూ ఆయన మొదటి భార్య వాదిస్తోంది. తామిద్దరూ విడాకులు తీసుకోనందున భార్యాభర్తలుగానే ఉన్నామని.. వాళ్లిద్దరిది అక్రమ వివాహం అంటూ రంగంలోకి దిగింది. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్తఫా, ప్రియమణి వివాహం గురించి సంచలన విషయాలను బయటపెట్టింది ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా. ముస్తఫా రాజ్, ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత.. మనస్పార్థలతో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు విడివిడిగా ఉంటూ వచ్చారు. ఇక తమ పిల్లల కోసం ముస్తఫా రాజ్ ప్రతి నెలా కొంత మొత్తం పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2017లో హీరోయిన్ ప్రియమణిని వివాహం చేసుకున్నాడు ముస్తాఫా రాజ్. అప్పటి నుంచి ప్రియమణితో కలిసి ఉంటున్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయిన ప్రియమణి.. తిరిగి ఇప్పుడిప్పుడే తన సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో కనిపించిన ప్రియమణి.. తాజాగా వెంకటేష్ సరసన నారప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ప్రియమణి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఇదిలా ఉంటే.. అన్యోన్యంగా దాంపత్య జీవనం గడిపేస్తున్న ప్రియమణి.. ముస్తఫా వివాహం చెల్లదు… ఆయన ఇంకా నా భర్తే అంటూ రంగంలోకి దిగింది ముస్తఫా మొదటి భార్య. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని.. కనుక ఇప్పటికీ ముస్తఫా తన భర్తే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మేము విడాకుల కోసం కోర్టులో అప్లై చేయలేదని.. విడిగా మాత్రమే ఉంటున్నామని.. కానీ.. ప్రియమణిని వివాహం చేసుకునే సమయంలో తాను బ్రహ్మాచారి అని ముస్తఫా చెప్పుకున్నట్లుగా ఆయేషా తెలిపింది. ఇప్పుడు ముస్తఫా తనను.. తన పిల్లలను పట్టించుకోవడం లేదని.. మేము ఇంకా విడాకులు తీసుకోనందున ప్రియమణి వివాహం చెల్లదని ఆయేషా తెలిపింది.
ఇక ఆయేషా ఆరోపణలపై ప్రియమణి భర్త ముస్తఫా స్పందించాడు.. తాను పిల్లల కోసం ప్రతి నెలా కొంత డబ్బు ఆయేషాకు పంపిస్తున్నానని.. ఒకవేళ అలా పంపకపోతే.. ఇన్ని రోజుల ఎందుకు సైలెంట్‌గా ఉందని ప్రశ్నిస్తున్నాడు. కేవలం డబ్బుల కోసం ఆయేషా ఇలా చేస్తుందని ముస్తఫా ఆరోపించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తన భర్త గురించి మాట్లాడుతూ.. ముస్తఫా భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ప్రియమణి పెళ్లి విషయం మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Samantha Akkineni: ‘నారప్ప’ సినిమాకు ఒక్క మాటలో రివ్యూ రాసిన సమంత..
Ariyana: అభిమానులకు షాకిచ్చిన అరియానా.. వెంటిలేటర్ పై అలా.. వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ..
ఈ చిన్నారి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలే.. ఎవరో గుర్తుపట్టండి..