
గత వారంతో పోల్చితే ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటికే పళ్ల బురుసు, ది రన్నర్ (హాలీవుడ్), అనంతన్ కాడు (మలయాళం), తాప్పీ గాంధారి వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 04)న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం తదితర సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి కంటే ముందు ఓ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించింది. అయితే ముందుగా ప్రకటించిన స్ట్రీమింగ్ డేట్ కంటే ఒక రోజు ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రావడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూనే సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కలలు కంటుంటాడు కనే షెల్లీ. ఇందుకోసం లాంగ్ లీవ్ తీసుకుని కొత్త సినిమా కథ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఇదే క్రమంలో షెల్లీకి ఓ పాత మర్డర్ కేసు ఫైల్ చిక్కుతుంది. ఆ కేస్ ఫైల్ లోని మూఢనమ్మకాలు, సైకలాజికల్ మిస్టరీలు షెల్లీని బాగా ఆకట్టుకుంటాయి. ఆ కేస్ ఫైల్ ఆధారంగానే కొత్త సినిమా కథ రాయాలని ఫిక్స్ అవుతాడు. అయితే అప్పుడే అసలు కథ మొదలవుతుంది. షెల్లీకి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి? మరి ఆ కేస్ ఫైల్ లో ఏముంది? షెల్లీ తన కలను నెరవేర్చుకున్నాడా? అన్నదే ఈ సినిమా మిగిలిన కథ.
తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమున్న కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పేరు ఉన్మాదం. పోలీస్ ఆఫీసర్, ‘నాయట్టు’, ‘జోసెఫ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన షాహి కబీర్ ఈ సినిమాకు స్టోరీ సమకూర్చగా, ప్రముఖ ఎడిటర్ కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. జై భీమ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ ఇందులో పోలీసాఫీసర్ భార్యగా నటించింది. అలాగే సిద్ధిక్, సుధీష్, సాబుమోన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు 143 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
നല്ല നേരം വരാൻ ഇനി വൈകും…#SonyLIV #SonyLIVMalayalam #Unmadham #UnmadhamOnSonyLIV@kunchacks @lijomol @kiran_das_mr @kumarmangatpathak @abhishekpathakk #ShahiKabir @panorama_studios @tseriesfilms pic.twitter.com/XkvJtHDsmZ
— Sony LIV Malayalam (@SonylivMal) September 3, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.