S. Thaman : వాడికి పనిస్తే ఇలా చేశాడు..సర్కారు వారి పాట సాంగ్ లీక్ పై తమన్ ఆవేదన..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

S. Thaman : వాడికి పనిస్తే ఇలా చేశాడు..సర్కారు వారి పాట సాంగ్ లీక్ పై తమన్ ఆవేదన..
Thaman

Updated on: Feb 13, 2022 | 7:40 AM

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. అయితే ప్రేమికుల రోజు సందర్భంగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ కళావతి పాటను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇటీవలే ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ పాట ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ పాట ఫుల్ సాంగ్ ఎప్పుడు విడుదలవుతుందా అని మహేష్ అభిమానులంతా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే సమయంలో మహేష్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది.

వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ కళావతి పాట ఇప్పుడు నెట్టింట్లో ప్రత్యేక్షమయ్యింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ సినిమా టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో… చిత్రయూనిట్‏పై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే సాంగ్ లీక్ అవ్వడం పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాట ఇలా లీక్ అవ్వడం చాలా భాదగా ఉంది అన్నారు. గుండె తరుక్కు పోయిందని అన్నారు తమన్, సుమారు వేయి మంది ఈ పాట కోసం పని చేశామని.. కానీ ఇలా విడుదలకు ముందే లీక్ అవ్వడం చాలా బాధాకరం అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమన్ ఓ ఆడియోను రిలీజ్ చేశారు. ఆరు నెలలు ఈ పాట కోసం చాలా కష్టపడ్డాం.. షూటింగ్ సమయంలో చాలా మందికి కరోనా వచ్చింది.. అవేమీ లెక్కచేయకుండా కష్టపడ్డాం.. అని తెలిపారు తమన్. మహేష్ అభిమానులకు తన టీమ్ తరపున క్షమాపణలు చెప్పారు తమన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amazon Youth Offer: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ అమెజాన్‌ కొత్త ఆఫర్‌.. ప్రైమ్‌పై 50 శాతం డిస్కౌంట్‌..

Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు ఇష్టమైన కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం మీ కోసం..

 

Loading...
Unable to load recommendations.
Follow Us