
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన మూవీని చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకెళ్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. చరణ్, తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాపై తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసలు కురిపించారు.. భారతదేశాన్ని విభజించాలనుకుంటే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడండి.. దేశాన్ని ఏకం చేయాలనుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ చూడండంటూ సీతక్క కామెంట్స్ చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘ఆర్ఆర్ఆర్’. భారీ అంచనాల మధ్య మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. మూడు రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లని రాబట్టి తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా సరన్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలోని సాంగ్స్ మరోవైపు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి.
Also Read: Penny Song: పెన్నీ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా.. సీతూపాప ఎంత ముద్దుగా చేసిందో..
Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..