Mrunal Thakur: అడ్వాన్స్‌డ్‌గా థింక్‌ చేస్తున్న సిల్వర్ స్క్రీన్‌ సీత.. మేడమ్ సార్ మేడమ్ అంతే..

కేవలం స్టైల్‌ సెన్స్‌ విషయంలోనే కాదు... క్యారెక్టర్ సెలక్షన్‌లోనూ అడ్వాన్స్‌డ్‌గా థింక్‌ చేస్తున్నారు మృణాల్‌. రిలీజ్‌కు రెడీ అవుతున్న పిప్పా సినిమాలో హీరో చెల్లెలి పాత్రలో నటించారు

Mrunal Thakur: అడ్వాన్స్‌డ్‌గా థింక్‌ చేస్తున్న సిల్వర్ స్క్రీన్‌ సీత.. మేడమ్ సార్ మేడమ్ అంతే..
Mrunal Thakur

Updated on: Jan 23, 2023 | 1:49 PM

ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్‌ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు. అంతేకాదు బిగ్ టార్గెట్‌ సెట్‌ చేసుకొని ప్లాన్ రెడీ చేస్తున్నారు. సీతారామం సినిమాలో మృణాల్‌ను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఇలాగే పాడుకుంటున్నారు. తొలి సినిమాతోనే సౌత్‌ ఆడియన్స్‌ను ఫిదా చేశారు ఈ నార్త్ బ్యూటీ. హోమ్లీ క్యారెక్టర్‌లో మృణాల్‌ను చూసి అచ్చమైన పదహారణాల తెలుగుతనం అంటూ పొగిడేశారు. సినిమాలో అంత ట్రెడిషనల్‌గా కనిపించినా.. రియల్ లైఫ్‌లో మాత్రం మోస్ట్ ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో రచ్చ చేస్తుంటారు ఈ బ్యూటీ.

కేవలం స్టైల్‌ సెన్స్‌ విషయంలోనే కాదు… క్యారెక్టర్ సెలక్షన్‌లోనూ అడ్వాన్స్‌డ్‌గా థింక్‌ చేస్తున్నారు మృణాల్‌. రిలీజ్‌కు రెడీ అవుతున్న పిప్పా సినిమాలో హీరో చెల్లెలి పాత్రలో నటించారు ఈ బ్యూటీ. కెరీర్‌ స్టార్టింగ్‌లో సిస్టర్‌ రోల్‌ వద్దని చాలా మంది వారించినా… రిస్క్ చేశారు. సీతారామం సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న మృణాల్‌ ఆ ఇమేజ్‌ను అలాగే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు నటనకు ఆస్కారం ఉన్న రోల్స్‌ చేస్తే క్రేజ్‌ ఆటోమేటిక్‌గా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

హీరోయిన్స్ స్టీరియోటైప్‌ రోల్స్‌కు గుడ్‌బై చెప్పాల్సిన టైమొచ్చిందన్నది మృణాల్ వర్షన్‌. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తేనే పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అవ్వగలమంటున్నారీ సీత.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..