
మోహన్‌లాల్… కంప్లీట్ యాక్టర్ ఎలా అయ్యారు..? అన్ని రకాల పాత్రల్నీ అవలీలగా చెయ్యడం వల్లా… లేకపోతే అనేక భాషల్లో నటించడంతోనా…? కాదు.. యాక్టింగ్‌ని ప్రాణంతో సమానంగా భావించడం వల్ల. ఆస్క్ మోహన్‌లాల్ అనే ఆన్‌లైన్ చాట్‌లో.. మోహన్ సారే స్వయంగా చెప్పిన మాట ఇది.
వాటీజ్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ యువర్ లైఫ్.. అని ఓ అభిమాని అడిగితే.. నథింగ్ బట్ సినిమా అని ఒక్క మాటలో చెప్పేశారు మోహన్‌లాల్. అందుకే ఇండియన్ సినిమాలో ఆయన మాత్రమే కంప్లీట్ యాక్టర్ అయ్యారు. ఈ మలయాళ మెగాస్టార్ నటించిన దృశ్యం సీక్వెల్ 19న ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్ అంటే.. బారోజ్ అని అక్కడికక్కడే సింపుల్‌గా అనౌన్స్ చేశారు మోహన్‌లాల్. 400 ఏళ్ల కిందట వాస్కోడగామా నిధినిక్షేపాలకు వన్‌అండ్ వోన్లీ గార్డియన్‌గా వున్న బారోజ్ అనే వీరుని కథ ఇది. పోర్చుగీస్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఈ పీరియాడికల్ మూవీని మోహన్‌లాలే డైరెక్ట్ చేస్తుండటం విశేషం.
Also Read:
ఐపీఎల్ వేలానికి సమయం ఆసన్నమైంది.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా..?
జనగామ జిల్లా కేంద్రంలో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం.. ఇలాంటి దాన్ని ఎప్పుడైనా చూశారా..?