Mehreen: గొప్పింటి కోడలు కాబోతున్న ఎఫ్-2 హీరోయిన్.. మార్చిలో మాజీ సీఎం మనవడితో నిశ్చితార్థం..

|

Feb 14, 2021 | 10:39 AM

Mehreen: టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. తక్కువ సినిమాలతో ఎక్కవ క్రేజ్ సంపాదించిన

Mehreen: గొప్పింటి కోడలు కాబోతున్న ఎఫ్-2 హీరోయిన్.. మార్చిలో మాజీ సీఎం మనవడితో నిశ్చితార్థం..
Follow us on

Mehreen: టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. తక్కువ సినిమాలతో ఎక్కవ క్రేజ్ సంపాదించిన హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ మోడల్ తొలి సినిమాతో ఆకట్టుకున్నారు. ఆ తరవాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక 2019లో వచ్చిన ‘F2’లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ నవ్వించారు. గతేడాది ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు ‘F3’లో నటిస్తున్నారు.

అయితే తాజాగా మెహ్రీన్ కౌర్ సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారు. ఎందుకంటే, ఆమె ఓ గొప్పింటికి కోడలు కాబోతున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని మెహ్రీన్ పెళ్లాడబోతున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక మార్చి 13న రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో ఘనంగా జరిగనుంది. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ చిత్రాల్లోనూ మెహ్రీన్ నటించారు. అయితే, భవ్యను పెళ్లాడిన తరవాత మెహ్రీన్ సినిమాలకు దూరమవ్వనున్నట్టు సమాచారం. ఎందుకంటే, గొప్పింటికి వెళ్తుంది కనుక మెహ్రీన్ ఇకపై నటించకపోవచ్చు అంటున్నారు.

Sumanth Ashwin: ఓ ఇంటివాడైన హీరో సుమంత్ అశ్విన్.. వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు..