Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆయన వీరాభిమాని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాపై ఇప్పటికే హైప్ ఎక్కువగానే ఉంది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూట్యూబ్

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..
Waltair Veerayya

Updated on: Jan 06, 2023 | 9:44 AM

మెగా అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆయన వీరాభిమాని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే హైప్ ఎక్కువగానే ఉంది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్‏తో దూసుకుపోతున్నాయి. మరోవైపు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వాల్తేరు వీరయ్య. ఓవైపు చిత్రప్రచార కార్యక్రమాల్లో బిజీగా పాల్గోంటున్న చిత్రయూనిట్.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసింది. ఈ వేడుకను విశాఖ సముద్ర తీరంలోని ఆర్ కె బీచ్ లో ప్లాన్ చేసింది టీం. కానీ ఆకస్మాత్తుగా పలు కారణాల చేత ఈ వేడుకకు బ్రేక్ పడింది.

ఇక ఇప్పుడు కొత్త వేదికను ఫిక్స్ చేసినట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. జనవరి 8న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక జనవరి 7న వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ నయా పోస్టర్ రిలీజ్ చేశారు

ఇవి కూడా చదవండి

ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్ పాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద్ నందమూరి, మెగా హీరోస్ పోటీపడబోతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.