Megastar Chiranjeevi: ఏడవ తరగతిలోనే ప్రేమలో పడిన చిరు.. మొగల్తూరు అమ్మాయి స్టోరీ చెప్పిన మెగాస్టార్..

ఇందులో నాగార్జున అడిగిన ప్రశ్నలకు చిరు, అమీర్, చైతూ సమాధానలిచ్చారు. ఆకాశంలో నక్షత్రాల కూటమిని గెలాక్సీ అంటారు. చిరు, చైతూ, అమీర్ చూపిస్తూ

Megastar Chiranjeevi: ఏడవ తరగతిలోనే ప్రేమలో పడిన చిరు.. మొగల్తూరు అమ్మాయి స్టోరీ చెప్పిన మెగాస్టార్..
Megastar Chiranjeevi

Updated on: Jul 31, 2022 | 9:16 PM

బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha). ఇందులో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటించగా.. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ , పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిరుతోపాటు (Megastar chiranjeevi) నాగార్జున, రాజమౌళి, సుకుమార్ లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని చూసి రివ్యూ కూడా ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన చైతూ పాత్ర ఇంట్రడ్యూసింగ్ వీడియో సైతం ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అమీర్ ఖాన్, చైతూ, చిరంజీవితో కలిసి నాగార్జున స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.

ఇందులో నాగార్జున అడిగిన ప్రశ్నలకు చిరు, అమీర్, చైతూ సమాధానలిచ్చారు. ఆకాశంలో నక్షత్రాల కూటమిని గెలాక్సీ అంటారు. చిరు, చైతూ, అమీర్ చూపిస్తూ ఇప్పుడు అలాంటి గెలాక్సీ నా ఎదురుగా కూర్చుంది అంటూ నాగార్జున వాయిస్ తో ప్రోమో ప్రారంభమైంది. అందులో లాల్ సింగ్ చద్దా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు అమీర్ ఖాన్. ఈ క్రమంలోనే మీరు మొదటి సారి ప్రేమలో ఎప్పుడు పడ్డారు అంటూ చిరును ప్రశ్నించారు అమీర్. ఏడవ తరగతిలో ప్రేమలో పడ్డాను. అమ్మాయి తొక్కుతూ వస్తుంటే తననే చూసేవాడిని అంటూ తన ఫస్ట్ లవ్ గురించి బయటపెట్టాడు మెగాస్టార్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.