
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 400 కోట్ల మేర కలెక్షన్లు సాధించి రీజినల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా థియేటర్లు, ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టిన మన శంకరవరప్రసాద్ గారు ఇప్పుడు మన ఇంటికి వచ్చేస్తున్నారు. అదే నండి టీవీ ప్రీమియర్స్ కు రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులు కూడా జీ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన శంకరవరప్రసాద్ గారు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. వచ్చే శనివారం ( ఫిబ్రవరి 28)న సాయంత్రం 5:30 కి ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రసారం కానుంది. ఈ మేరకు జీ తెలుగు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల సంయుక్తంగా ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సినిమాను నిర్మించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. వీరితో పాటు క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు ఈ సినిమాలో తళుక్కుమన్నారు. ఇక భీమ్స్ అందించిన పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
Grace or Mass.. Boss has no boundaries 😎🤘 Numero Uno 👑
A Mega Victory tsunami is ready to storm your screens ❤️🔥🌊
Don’t miss World Television Premiere #ManaShankaraVaraPrasadGaru On Feb 28th, Sat at 5:30 PM On #ZeeTelugu
Streaming Now On #Zee5#ZeeTeluguSpotlight… pic.twitter.com/x93LEkz6V2
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 22, 2026
Blockbuster celebrations of #MSG
Boss @KChiruTweets garu was felicitated at an exclusive gathering hosted by Shri K.V Rao
#ManaShankaraVaraPrasadGaru
pic.twitter.com/9GpwrkFW9U— Megastar Chiranjeevi (@ChiruFanClub) February 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.