Bholaa Shankar: భోళా శంకర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. మెగాస్టార్ చిరంజీవి లుక్స్ అదుర్స్..

|

Mar 01, 2022 | 9:44 AM

మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య

Bholaa Shankar: భోళా శంకర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. మెగాస్టార్ చిరంజీవి లుక్స్ అదుర్స్..
Bhola Shankar
Follow us on

మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తిచేసిన మెగాస్టార్.. ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్‏గా భోళా శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చెల్లెల్లి సెంటిమెంట్ ప్రధానంగా ఈ స్టోరీ రూపొందుతుండగా.. ఇందులో చిరు చెల్లెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చిత్రాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా శివరాత్రి కనుకగా ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫోటోను వైబ్ ఆఫ్ భోళా అంటూ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్ ఆకట్టుకుంటుంది. అన్నాచెల్లెల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న చిత్రమిది. అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం అంటూ మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది.

Also Read: Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..

Rashmika Mandanna: ఆ సినిమాలో కష్డపడితే.. ఈ మూవీ పిక్నిక్‏లా ఎంజాయ్ చేశా.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్..

Mishan Impossible : తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ విడుదలయ్యేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.