మొన్న అలియా భట్, ఇప్పుడు కాజల్ అగర్వాల్( Kajal Aggarwal).. ఇద్దరూ ఒకే రీజన్‌తో వార్తల్లోకెక్కి హల్‌చల్ చేస్తున్నారు. మేమింతే టైపులో మోనార్కిజం చూపిస్తున్నారంటూ ట్రోలర్లకు ఛాన్స్ ఇస్తున్నారు. స్టార్ హీరోలకు, దర్శకులకు ఇన్‌డైరెక్ట్‌గా ఛాలెంజ్ విసురుతున్న వీళ్ల ధోరణిపై ఇండస్ట్రీలో కాస్త సీరియస్‌గానే టాక్ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ చిరకాల కోరికను మన్నిస్తూ ఆచార్య మూవీ నుంచి ట్రైలరొచ్చేసింది. చిన్న గ్యాప్ తర్వాత చిరూ-చెర్రీల డబుల్ డోస్‌తో సాలిడ్‌గా ఓ పాట కూడా రిలీజైంది. ఇక.. ప్రిరిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ.. చీఫ్‌గెస్ట్‌గా ఎవరొస్తారు లాంటి టాపిక్ ఒకవైపు ట్రెండ్ అవుతుంటే.. మరో సైడ్‌నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీద స్పెషల్‌గా ఫోకస్ పడింది. ఆచార్య సినిమా ప్రమోషన్‌లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది అటుంచితే.. కనీసం ఆచార్య ట్రయిలర్‌ని సోషల్ మీడియాలో ట్యాగ్ చెయ్యలేదంటూ కాజల్ మీద ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. నిజానికి నాలుగైదు నెలలుగా ఆమె సినిమాలతో టచ్‌లోనే లేరు. కొన్ని సినిమాలకిచ్చిన కాల్‌షీట్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. కాజల్ ఇన్‌స్టా నిండా ప్రెగ్నెన్సీ ఫోటోలు, మెసేజ్‌లు, పెయిడ్ పార్ట్‌నర్షిప్ పోస్టులే కనిపిస్తున్నాయి.
దుల్కర్ సినిమా హే సినామికాను పనిగట్టుకుని విపరీతంగా ప్రమోట్ చేసిన కాజల్.. ఆచార్య సినిమాను కనీసం పట్టించుకోలేదు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆచార్య షెడ్యూల్స్‌కి సరిగ్గా ఎటెండవక డైరెక్టర్‌ని ఇబ్బంది పెట్టారన్న విమర్శలు కూడా వున్నాయి. ట్రైలర్‌లో పూజాహెగ్డే అన్నిసార్లు కనిపించినా, తన అప్పియరెన్స్ ఒక్కసారైనా లేకపోవడం కాజల్ గుస్సా అవడానికి మరో కారణమట.ట్రిపులార్ రిలీజ్ టైమ్‌లో దూరంగా ఉన్న ఆలియా భట్ మీద కూడా ఇటువంటి ఎలిగేషన్సే వినిపించాయి. నిజానికి ఆచార్య బోర్డింగ్‌లోకి తత్కాల్ కోటాలో వచ్చారు కాజల్. త్రిష వద్దనుకున్న ప్లేస్‌లో కాజూకి ఛాన్సొచ్చింది. ఇప్పుడు సినిమా రిలీజయ్యే టైమ్‌లో కూడా చందమామే కార్నర్ అవుతున్నారు. ఏదేమైనా బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ టైమ్‌లో మిత్రవింద ఇలా ట్రోలర్లకు దొరికిపోవడం బాధాకరమే కదా!
మరిన్ని ఇక్కడ చదవండి :